Share News

రామ్‌ హిట్‌ యాదవ్‌..రామ్‌నే యాదవ్‌కో మారా!

ABN , Publish Date - Oct 27 , 2026 | 05:15 AM

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలోని పేర్లను ఎన్నికల సంఘం(ఈసీ) సాఫ్ట్‌వేర్‌ చిత్రవిచిత్రంగా అనువాదం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రామ్‌ హిట్‌ యాదవ్‌..రామ్‌నే యాదవ్‌కో మారా!
ECI

  • యూపీలో ఓటర్ల పేర్ల ఎంట్రీ, అనువాదంలో విచిత్రాలు

  • రామ్‌హిత్‌ పేరు ఇంగ్లి్‌షలో రామ్‌ హిట్‌గా ఎంట్రీ

  • దాన్ని హిందీలో రామ్‌..యాదవ్‌ను కొట్టాడంటూ అనువాదం

న్యూఢిల్లీ, అక్టోబరు 26: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో ఓటర్ల జాబితాలోని పేర్లను ఎన్నికల సంఘం(ఈసీ) సాఫ్ట్‌వేర్‌ చిత్రవిచిత్రంగా అనువాదం చేస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రామ్‌హిత్‌యాదవ్‌ అనే ఓటరు పేరును రామ్‌ హిట్‌ యాదవ్‌ అని ఇంగ్లిషులో, ‘రామ్‌నే యాదవ్‌ కో మారా’ (యాదవ్‌ను రాముడు కొట్టాడు అని అర్థం) అంటూ హిందీలో పేర్కొనటంతో ఆ ఓటరు హతాశడుయ్యాడు. సదరు వీడియోను ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను ఉద్దేశించి వ్యంగ్యంగా కొన్ని ప్రశ్నలు సంధించారు. ‘జ్ఞానేశ్‌కుమార్‌ జీ, రాముడు యాదవ్‌నే ఎందుకు కొట్టాడు? ఏ సింగ్‌నో, పాఠక్‌నో, అస్థానానో, శర్మనో, రాయ్‌నో, బిష్త్‌నో ఎందుకు కొట్టలేదు? మీ కంప్యూటర్‌కు కులతత్వముందా? ఏదైనా రాజకీయపార్టీ అజెండాను మీరు అమలు చేస్తున్నారా?’ అని పేర్కొన్నారు. దీనిపై యూపీ ఎన్నికల ప్రధానాధికారి నవ్‌దీప్‌ రిన్వా సోమవారం స్పందించారు. ఇంగ్లిషులో ఉన్న పేర్లను హిందీలోకి అనువాదం చేసే విధంగా సాఫ్ట్‌వేర్‌ తయారైందని, దానివల్లే కొందరి పేర్ల విషయంలో తప్పులు జరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఈ పొరపాట్లను సరిచేస్తున్నామని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్

SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్

Updated Date - Oct 27 , 2026 | 05:16 AM