Share News

బర్త్‌డే వేడుకల్లో దారుణం.. ముగ్గురిని చంపేసిన బర్త్‌డే బాయ్..

ABN , Publish Date - Apr 27 , 2026 | 07:59 AM

పుట్టిన రోజు వేడుక సందర్భంగా స్నేహితులు ముఖానికి కేక్ పూశారని బర్త్‌డే బాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ముగ్గురు స్నేహితులను తుపాకితో కాల్చి చంపాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది.

బర్త్‌డే వేడుకల్లో దారుణం.. ముగ్గురిని చంపేసిన బర్త్‌డే బాయ్..
Bulandshahr shooting

లక్నో, ఏప్రిల్ 27: ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుక సందర్భంగా స్నేహితులు ముఖానికి కేక్ పూశారని బర్త్‌డే బాయ్ ఘాతుకానికి ఒడిగట్టాడు. ముగ్గురు స్నేహితులను తుపాకితో కాల్చి చంపాడు. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. బులందేశ్వర్ జిల్లాలోని ఖుర్జా ఏరియాకు చెందిన జీతూ సైనీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం రాత్రి సుభాష్ రోడ్‌లోని ఆర్‌జేఎస్ ఫిట్‌నెస్ జిమ్‌లో పార్టీ జరిగింది. ఈ పార్టీకి జీతూ ఫ్రెండ్స్ వచ్చారు.


రాత్రి 12 గంటల సమయంలో జీతూ కేక్ కట్ చేశాడు. ఆ వెంటనే అతడి స్నేహితులు కేక్‌ను జీతూ ముఖానికి పూశారు. దీంతో జీతూ అసహనానికి గురయ్యాడు. స్నేహితులతో గొడవ పెట్టుకున్నాడు. గొడవ చిలికిచిలికి గాలి వానలా మారింది. జీతూ కోపంగా అక్కడినుంచి వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తర్వాత తన అనుచరులలో జిమ్ దగ్గరకు వచ్చాడు. వెంట తన సోదరుడి లైసెన్స్ తుపాకి కూడా తెచ్చుకున్నాడు. జిమ్ ఫస్ట్ ఫ్లోర్‌లోకి చేరుకోగానే స్నేహితులపై కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 35 ఏళ్ల అమర్ దీప్, 32 ఏళ్ల మనీష్, 19 ఏళ్ల ఆకాశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.


నిందితుడు సీసీటీవీ డీవీఆర్‌ను తొలగించి తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు 15 మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు జీతూ .. ఆకాశ్‌ను వెంబడించి మరీ తలపై కాల్చి చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసు బృందాలు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వాకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?

రష్యాకు ఇరాన్ విదేశాంగ మంత్రి.. అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ..

Updated Date - Apr 27 , 2026 | 08:14 AM