Share News

ఎప్‌స్టీన్‌ వార్తల్లో పేరు.. వారిపై దావా వేసిన కేంద్రమంత్రి కూతురు

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:30 PM

కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుమార్తెకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి.

ఎప్‌స్టీన్‌ వార్తల్లో పేరు.. వారిపై దావా వేసిన కేంద్రమంత్రి కూతురు
Hardeep Singh Puri daughter lawsuit

న్యూఢిల్లీ, మార్చి 16: ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రపంచ ప్రముఖుల పేర్లు ఉండటంతో పెను దుమారం చెలరేగుతోంది. ఆ ఫైల్స్‌లో ఇండియాకు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కుమార్తెకు ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంబంధం ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై హర్దీప్ సింగ్ పురి కుమార్తె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


తనపై సోషల్ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై 10 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. గతనెల 22వ తేదీ నుంచి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తనను టార్గెట్ చేసి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని కోర్టుకు వివరించారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో హర్దీప్ సింగ్ పురి పేరు

అమెరికా న్యాయ శాఖ ఇటీవల భారీ ఎత్తున ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఫైళ్లను విడుదల చేసింది. అందులో కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేరు కూడా ఉంది. హర్దీప్ సింగ్ పురి, జెఫ్రీ ఎప్‌స్టీన్ 2014, 2015 మధ్య అనేక ఈమెయిల్ సంభాషణలు జరిపినట్లు ఆ పత్రాలలో ఉంది. అయితే, హర్దీప్ సింగ్ మాత్రం ఎప్‌స్టీన్ నేర కార్యకలాపాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మిదుర్గను ప్రశ్నించిన సిట్‌

అసెంబ్లీ హాజరు విషయంలో ఎమ్మెల్యేలు నిర్లక్ష్యం వహించొద్దు: సీఎం రేవంత్‌రెడ్డి

Updated Date - Mar 16 , 2026 | 06:38 PM