Share News

రూ.4.5 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం

ABN , Publish Date - Jul 31 , 2026 | 05:24 PM

కేంద్ర కేబినెట్ నేడు రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు.

రూ.4.5 లక్షల కోట్ల ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Union Minister Ashwini Vaishnaw

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర కేబినెట్ నేడు రూ.4.5 లక్షల కోట్ల విలువైన పథకాలు, ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఈ వివరాలను మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వెల్లడించారు. మొత్తం 4,50,988 కోట్ల రూపాయల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. ప్రధానమంత్రి సూర్య సరోవర్ యోజనకు 5,070 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు. ఇప్పటికే తలసరి సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో భారత్ మొదటి స్థానంలో ఉందని మంత్రి అన్నారు. ఈ పథకం కింద డ్యామ్‌లు, సరస్సులపై ఫ్లోటింగ్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి 5000 మెగా వాట్స్ విద్యుత్ ఉత్పత్తి చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని అన్నారు. రాబోయే ఐదేళ్లల్లో ఫ్లోటింగ్ సోలార్ ప్యాసెల్ విద్యుత్ ఉత్పత్తిని 7 రెట్లు పెంచుతామని చెప్పారు.


ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి 3,15,614 కోట్ల రూపాయలు కేటాయించినట్టు మంత్రి తెలిపారు. 2026-2030 మధ్య కాలానికి ఈ మొత్తాన్ని కేటాయించినట్టు తెలిపారు. ఇక సముద్ర మంథన్ పథకానికి 84,084 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. 2030-31 వరకూ ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. సముద్రం అడుగున దాగున్న ముడిచమురు, సహజవాయువు వనరుల గుర్తింపు కోసం కేంద్రం ఈ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఖేలో ఇండియా పథకానికి సంబంధించి కేంద్రం రాబోయే ఐదేళ్ల కాలానికి రూ.29,054 కోట్లు కేటాయించిందని కూడా మంత్రి తెలిపారు. యూనీ డైరెక్షనల్ ట్విన్ ట్యూబ్ టన్నుల్స్ నిర్మాణానికి 9,779 కోట్ల రూపాయలు కేటాయించామని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

ఆయన దీక్ష చేయకపోతే ధర్మేంద్ర రాజీనామా సాధ్యమయ్యేదే కాదు: అభిజీత్ దీప్కే

సీఎం ఒమర్ అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేస్తాం: సుప్రీం కోర్టు

Updated Date - Jul 31 , 2026 | 06:25 PM