రూ.12,236 కోట్లతో రైల్, మెట్రో, ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:25 PM
రళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన పీఎంఓ బిల్డింగ్ సేవా తీర్థ్‌లో మంగళవారంనాడు మంత్రివర్గం సమావేశమైంది.
న్యూఢిల్లీ: కేరళ రాష్ట్రం పేరును 'కేరళం'గా మారుస్తూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నూతన పీఎంఓ బిల్డింగ్ సేవా తీర్థ్‌లో మంగళవారంనాడు మంత్రివర్గం సమావేశమైంది. కేరళ పేరు మార్పుతో సహా పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమావేశానంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మీడియాకు తెలిపారు.
కేరళ పేరును కేరళంగా మార్చే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని, పేరు మార్పు బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఆమోదానికి పంపుతామని మంత్రి తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తరువాత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.
మరిన్ని కీలక నిర్ణయాలు
రూ.12,236 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక సదుపాయాలు, విధానపరమైన నిర్ణయాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో రైల్వేలు, అర్బన్ ట్రాన్‌పోర్ట్, ఏవియేషన్, మౌలికసదుపాయాల కల్పన వంటివి ఉన్నాయి. విద్యుత్ రంగం సంస్కరణలపై కూడా విధానపరమైన నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ.5.236 కోట్ల అంచనా వ్యయంతో గోండియా-జబల్‌పూర్ రైల్వే లైను డబ్లింగ్ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రూ.2,668 కోట్ల పెట్టుబడితో పునరాఖ్-కియుల్ (Punarakh and Kiul) మధ్య 3,4వ రైల్ లైన్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. రూ.1,168 కోట్ల అంచనా వ్యయంతో గమారియా-చాందిల్ (Gamharia and Chandil) మధ్య 3,4వ రైల్వే లైన్ నిర్మాణానికి, రూ.1,667 కోట్లతో శ్రీనగర్‌లో కొత్త ఇంటిగ్రేటెడ్ ఎయిర్‌పోర్ట్ టెర్మినల్‌కు సమ్మతి తెలిపింది. రూ.1,067 కోట్లతో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2బి విస్తరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఇవి కూడా చదవండి..
కేరళ కాదు 'కేరళం'.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
ప్రతి కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సాయం.. అన్నాడీఎంకే హామీల వర్షం