Share News

'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'.. ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు!

ABN , Publish Date - Jul 05 , 2026 | 07:22 PM

అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన 'రామరక్ష' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు.

'అయోధ్య ట్రైలర్ మాత్రమే.. కాశీ, మథుర దోపిడీపై భయమేస్తోంది'.. ఉద్ధవ్ ఠాక్రే తీవ్ర విమర్శలు!
Uddhav Thackeray Targets BJP Over Ram Temple Donation Case

ముంబై, జులై 5: అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంపై శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముంబైలోని దాదర్‌లో నిర్వహించిన 'రామరక్ష' ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన మద్దతుదారులతో కలిసి హనుమాన్ స్తోత్రం, హనుమాన్ చాలీసా పారాయణం చేశారు.


'అయోధ్య అనేది కేవలం ఒక ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందుంది.. కాశీ, మథుర కడతాం అని కొందరు చెబుతున్నారు. కానీ అయోధ్యలోనే ఇంత పెద్ద ఎత్తున విరాళాల దోపిడీ జరిగితే.. రేపు కాశీ, మథురలో జరిగే దోపిడీ గురించి నాకు భయమేస్తోంది' అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. హిందువులను దోచుకునేవారే ఇప్పుడు అధికారంలో ఉండటం దురదృష్టకరమన్నారు.


బీజేపీ లేని హిందుత్వం కావాలి

ప్రధాని మోదీని ఛత్రపతి శివాజీ మహారాజ్‌తో పోల్చడంపై ఆయన మండిపడ్డారు. తమ పార్టీ మద్దతు, కష్టార్జితంతోనే మోదీ ప్రధాని అయ్యారని, అలాంటిది ఇప్పుడు ఆయనే హిందుత్వాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తమకు బీజేపీ మార్కు హిందుత్వం కాకుండా, స్వచ్ఛమైన హిందుత్వం కావాలని పిలుపునిచ్చారు. రామాలయంలో విరాళాలు దొంగిలించిన వారికి శ్రీరాముడి పేరెత్తే అర్హతే లేదని దుయ్యబట్టారు. హిందువులు వెర్రివాళ్లు కాదని, రాముడి సొమ్మును లూటీ చేసిన వారిని క్షమించరని స్పష్టం చేశారు. భగవాన్ శ్రీరాముడిని కాపాడుకోవడానికి హిందువులంతా కలిసి రావాలని ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 08:33 PM