బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రధాన నిందితుల అరెస్టు
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:29 AM
బిహార్‌లో సంచలనం కలిగించిన బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు పట్టుబడడం గమనార్హం. జాముయిలో ఈ నెల 19న బాలికపై జరిగి అత్యాచారం ఘటనలో ఇంతవరకు వీరిద్దరితో కలిపి అయిదుగుర్ని అరెస్టు చేసినట్టయిందని పోలీసులు చెప్పారు.
కాల్పులు జరిపి పట్టుకున్న పోలీసులు
పట్నా, సెప్టెంబరు 22: బిహార్‌లో సంచలనం కలిగించిన బాలికపై లైంగిక వేధింపుల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో వారు పట్టుబడడం గమనార్హం. జాముయిలో ఈ నెల 19న బాలికపై జరిగి అత్యాచారం ఘటనలో ఇంతవరకు వీరిద్దరితో కలిపి అయిదుగుర్ని అరెస్టు చేసినట్టయిందని పోలీసులు చెప్పారు. వీరిలో ముగ్గురు మైనర్లని తెలిపారు. కోచింగ్ సెంటర్‌కు వెళ్లిన ఆ బాలిక, మరో బాలుడ్ని నిందితులు రోడ్డుపైనే నిర్బంధించి వేధించారు. అనంతరం ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై ఓ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దాని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించారు. ప్రధాన నిందితుడు నందన్ యాదవ్‌ను పట్టుకోవడానికి ప్రయత్నించగా కాల్పులు జరిపాడని, పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపి అతడి కాలుకు గాయపరిచారని జాముయి ఎస్పీ చెప్పారు. అతడి పక్కనే ఉన్న మరో నిందితుడు హరేరాం పారిపోవడానికి ప్రయత్నిస్తూ కింద పడ్డాడని తెలిపారు. ఆ సమయంలోనే వారిని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన వివరించారు.
ఈ వార్తలను చదవండి
వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి
వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు చిత్రాలకు 9 అవార్డులు