Share News

రెండు భారత నౌకలకు ‘దారి’!

ABN , Publish Date - Mar 15 , 2026 | 07:21 AM

ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ గురువారం జరిపిన చర్చలు సత్ఫలితాలిచ్చాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన...

రెండు భారత నౌకలకు ‘దారి’!

  • హోర్ముజ్‌ దాటి అంతర్జాతీయ జలాల్లోకి ఎల్‌పీజీ షిప్‌లు

  • వీటిలో ఒకటి ‘శివాలిక్‌’, రెండోది నందాదేవి

  • 92 వేల టన్నుల వంటగ్యాస్‌తో నేడో రేపో ఇండియాకు

న్యూఢిల్లీ, మార్చి 14: ఇరాన్‌ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ప్రధాని మోదీ గురువారం జరిపిన చర్చలు సత్ఫలితాలిచ్చాయి. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా హోర్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకుపోయిన రెండు భారతీయ ఎల్‌పీజీ నౌకలు శివాలిక్‌, నందాదేవి శనివారం ఉదయం 9.30 గంటలకు భారత నౌకాదళం రక్షణలో సురక్షితంగా అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించాయి. శివాలిక్‌ 40 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్‌పీజీతో కాండ్లా రేవు(గుజరాత్‌)కు వస్తుండగా.. నందాదేవి 52 వేల మెట్రిక్‌ టన్నుల ఎల్‌పీజీతో ముంబై రేవుకు తీసుకొస్తోంది. ఒకట్రెండు రోజుల్లో అవి చేరుకుంటాయని భారత షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌కుమార్‌ సిన్హా శనివారం వెల్లడించారు. ప్రస్తుతం హోర్ముజ్‌లో ఇంకా 22 భారత నౌకలు ఉన్నాయి.. వీటిలో 6 ఎల్‌పీజీవి, ఒకటి సీఎన్‌జీ, 4 క్రూడాయిల్‌ నౌకలు. వీటికి కూడా ఇరాన్‌ దారి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వీటికి ముందు శుక్రవారం ఒక ఎల్‌పీజీ నౌక ముంబై రేవుకు చేరుకున్న సంగతి తెలిసిందే. అలాగే భారతీయ పతాకం కలిగిన జగ్‌ప్రకాశ్‌ అనే నౌక కూడా ఒమాన్‌ గుండా ఆఫ్రికా బయల్దేరింది.

ఇవి కూడా చదవండి...

గ్యాస్‌ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ

కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే

Updated Date - Mar 15 , 2026 | 07:21 AM