‘హంటా’ నౌకలోని ఇద్దరు భారతీయులు క్షేమం
ABN , Publish Date - May 12 , 2026 | 05:04 AM
అర్జెంటీనా నుంచి స్పెయిన్ బయల్దేరిన ఎంవీ హోండియస్ అనే డచ్ క్రూయిజ్ షిప్‌లో ప్రాణాంతక హంటా వైరస్ కేసులు...
న్యూఢిల్లీ, మే 11: అర్జెంటీనా నుంచి స్పెయిన్ బయల్దేరిన ఎంవీ హోండియస్ అనే డచ్ క్రూయిజ్ షిప్‌లో ప్రాణాంతక హంటా వైరస్ కేసులు వెలుగు చూడడం తీవ్ర కలకలం రేపింది. ఈ వైరస్ కారణంగా ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. నౌకలోని మరో ఆరుగురికి వైరస్ సోకినట్టు తేలింది. వైరస్ సోకిన వారిలో ఇద్దరు భారతీయ సిబ్బంది కూడా ఉండడం మరింత ఆందోళనకు గురిచేసింది. ప్రస్తుతం ఈ నౌక స్పెయిన్‌లోని కానరీ దీవుల తీరానికి చేరుకుంది. నౌకలో హంటావైరస్ బారిన పడిన ఇద్దరు భారతీయులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, వారిలో వైరస్ లక్షణాలేమీ లేవని మాడ్రిడ్‌లోని భారత రాయబార కార్యాలయం సోమవారం ధ్రువీకరించింది.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్