Teenage athletes found dead: కొల్లం స్పోర్ట్స్ హాస్టల్‌లో ఇద్దరు బాలికల ఆత్మహత్య..
ABN , Publish Date - Jan 15 , 2026 | 11:32 AM
కేరళలోని కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్ గదిలో గురువారం ఇద్దరు స్పోర్ట్స్ ట్రైనీలు ఉరివేసుకుని మరణించారు. కోజికోడ్‌కు చెందిన 17 బాలిక, తిరువనంతపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
కేరళ: కొల్లంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్ గదిలో గురువారం ఇద్దరు స్పోర్ట్స్ ట్రైనీలు ఉరివేసుకుని మరణించారు. కోజికోడ్‌కు చెందిన 17 బాలిక, తిరువనంతపురానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం ట్రైనింగ్ సెషన్‌కు ఆ ఇద్దరు బాలికలు హాజరు కాకపోవడంతో ఇతర విద్యార్థినులకు అనుమానం వచ్చింది (Kerala hostel death).
ఆ బాలికల రూమ్‌కు వెళ్లి పదేపదే తలుపు తట్టినా సమాధానం రాకపోవడంతో హాస్టల్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అధికారులు తలుపు పగలగొట్టి చూశారు (SAI hostel Kollam). గదిలో ఇద్దరు బాలికలు ఉరివేసుకుని కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కోజికోడ్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక అథ్లెటిక్ ట్రైనీ కాగా.. పదో తరగతి చదువుతోంది. అలాగే 15 ఏళ్ల బాలిక కబడ్డీ క్రీడాకారిణి. ఆమె పదో తరగతి చదువుతోంది. గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
చైనా-పాక్ ఒప్పందం చెల్లదు.. ఆ వ్యాలీ భారత్‌కు ఎందుకు కీలకం..
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..