Share News

ట్విష శర్మ కేసు.. భోపాల్‌కు వెళ్లనున్న సీబీఐ బృందం!

ABN , Publish Date - May 25 , 2026 | 01:03 PM

నటి ట్విష శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది.

ట్విష శర్మ కేసు.. భోపాల్‌కు వెళ్లనున్న సీబీఐ బృందం!
Twisha Sharma case

భోపాల్, మే 25: నటి ట్విష శర్మ అనుమానాస్పద మృతి కేసును సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించిన సంగతి తెలిసిందే. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం సోమవారం ఈ కేసుపై విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ట్విష, సమర్థ్ కుటుంబసభ్యులకు.. మీడియాకు ధర్మాసనం కీలక సూచనలు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో మీడియాతో మాట్లాడవద్దని.. పబ్లిక్ స్టేట్‌మెంట్లు ఇవ్వవద్దని ట్విష, సమర్థ్ కుటుంబసభ్యులను కోరింది. కేసులో సాక్ష్యులైన వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేయవద్దని మీడియాను కోరింది.


మీడియా సాక్షుల స్టేట్‌మెంట్లు రికార్డు చేయటం వల్ల దర్యాప్తులోని ముఖ్యమైన అంశాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజలు కూడా ఎలాంటి ఊహాగానాలకు తావివ్వకుండా దర్యాప్తు సంస్థపై నమ్మకం ఉంచాలని విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు ముగింపు దశకు చేరుకున్నాక నిజం కచ్చితంగా బయటకు వస్తుందనే విశ్వాసాన్ని ధర్మాసనం వ్యక్తం చేసింది.


నేడు భోపాల్‌కు వెళ్లనున్న సీబీఐ బృందం!

విచారణ సందర్భంగా ధర్మాసనం సీబీఐ దర్యాప్తు ప్రస్తావన తెచ్చింది. ట్విష శర్మ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం చేసిన సిఫార్సు తమ ముందున్న ప్రధానాంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ తక్షణమే దర్యాప్తు చేపట్టేలా చూసేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానని సాలిసిటర్ జనరల్ ధర్మాసనానికి హామీ ఇచ్చినట్లు కోర్టు తెలిపింది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో.. సీబీఐ బృందం సోమవారం భోపాల్ వెళ్లే అవకాశం ఉంది. అధికారికంగా ట్విష కేసు దర్యాప్తును చేపట్టే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

ఫ్రెంచ్ ఓపెన్: సంచలనం సృష్టించిన ప్రవాసాంధ్రుడు

ఇంధన ధరల పెంపు.. ప్రధానిపై రాహుల్ గాంధీ ధ్వజం

Updated Date - May 25 , 2026 | 01:20 PM