Share News

ఈ కల్యాణం..కమనీయం..కవలీయం

ABN , Publish Date - Aug 03 , 2026 | 06:17 AM

కేరళలోని పతనంతిట్ట జిల్లా కుంబులవెల్లికి చెందిన టోమిచన్‌, మేరీకుట్టి దంపతులకు మ్యాగి, మారియా అనే కవల పిల్లలున్నారు...

ఈ కల్యాణం..కమనీయం..కవలీయం

వధువులు, వరులు, వారికి పెళ్లి జరిపించిన ఫాదర్లు, వారి సహాయకులు.. అంతా కవలలే

కొట్టాయం, ఆగస్ట్‌ 2: కేరళలోని పతనంతిట్ట జిల్లా కుంబులవెల్లికి చెందిన టోమిచన్‌, మేరీకుట్టి దంపతులకు మ్యాగి, మారియా అనే కవల పిల్లలున్నారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా పెరిగారు. పెళ్లి అయినా కూడా విడిపోకూడదని, అందుకోసం కవలలనే పెళ్లాడాలని అనుకున్నారు. వారి ఆకాంక్షకు పెద్దలు మద్దతు పలికారు. చంగనస్సేరి(కొట్టాయం జిల్లా) సమీపంలోని వెట్టుపరంబిల్‌ గ్రామంలో కుంజుమాన్‌ థామస్‌, జోమోల్‌ దంపతులకు అఖిల్‌, నిఖిల్‌ అనే కవల పిల్లలు ఉన్నారని తెలిసింది. దీంతో ఈ నలుగురు కవలల పెళ్లిళ్లు ఖాయమయ్యాయి. అయితే, తమ వివాహాన్ని ఎవరైనా కవలలైన చర్చి ఫాదర్లే నిర్వహిస్తే మరింత బావుంటుందని వారు అనుకున్నారు. చాలా చోట్ల విచారించగా.. చివరికి కంజిరప్పల్లి డయోసె్‌సకు చెందిన కవల ఫాదర్లు ఆంటో పెజుంకట్టిల్‌, అజో పెజుంకట్టిల్‌ వివరాలు తెలిశాయి. సంప్రదించగా వారు బ్లెస్సింగ్స్‌ ఇచ్చేశారు. అంతేకాదు జెరోన్‌, జోహన్‌ అనే కవల సోదరులు ఫాదర్లకు సహాయకులుగా వ్యవహరించడం మరో విశేషం.

ఈ వార్తలనూ చదవండి:

ఇండోనేషియాలో ఘోర అగ్నిప్రమాదం.. ఐదుగురి మృతి, 41 మంది గల్లంతు..

వాషింగ్టన్‌లో భారీ కార్చిచ్చు.. 2.5 లక్షల ఎకరాలు దగ్ధం..

Updated Date - Aug 03 , 2026 | 06:17 AM