అందుకే విజయ్‌కి మద్దతు ఇచ్చాము: వీసీకే చీఫ్
ABN , Publish Date - May 09 , 2026 | 09:03 PM
ప్రభుత్వ ఏర్పాటులో విజయ్‌కు అడ్డంకిగా మారకూడదనే తాము మద్దతు ఇచ్చినట్టు వీసీకే చీఫ్ తిరుమావళవన్ తాజాగా తెలిపారు. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించొద్దనేదే తమ అభిమతమని కూడా తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: దాదాపు మూడు రోజుల సస్పెన్స్ తరువాత తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ సారథ్యంలో ప్రభుత్వం కొలువు దీరనుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతు ఇస్తున్నామని వీసీకే పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ తాజాగా తమిళనాడు గవర్నర్ ఆర్లేకర్‌కు లేఖ రాయడంతో విజయ్‌కు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. తమ నిర్ణయంపై వీసీకే చీఫ్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
‘విజయ్ సారథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు మేము అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాము. అంతేకాకుండా, తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించకుండా ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే మేము మద్దతు ఇస్తున్నాము’ అని తిరుమావళవన్ చెప్పారు.
తమ కూటమి భాగస్వామి, డీఎంకే అధినేత స్టాలిన్‌కు కూడా టీవీకేకు మద్దతు ఇవ్వబోతున్నట్టు ముందే చెప్పానని ఆయన అన్నారు. ఆయన అభినందనలు తెలిపారని అన్నారు. టీవీకేకు మద్దతు ఇచ్చేందుకు ఎలాంటి షరతులు విధించలేదని కూడా అన్నారు. విజయ్ తనను కలిసేందుకు వస్తానన్నా తాను వారించానని తెలిపారు. ప్రమాణస్వీకార కార్యక్రమంలో కలుసుకుందామని చెప్పానని అన్నారు. దీర్ఘకాలిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని లెఫ్ట్ పార్టీలతో చర్చించి సమిష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నామని కూడా ఆయన చెప్పారు. ‘ముందు వాళ్లు మద్దతు ప్రకటించారు. ఆ తరువాత మేము కొంత చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నాము’ అని అన్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకేతో పాటు ఐయూఎమ్‌ఎల్ కూడా విజయ్‌కు మద్దతు పలికిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విజయ్ 120 మంది ఎమ్మెల్యే మద్దతు లేఖలతో గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు, లెఫ్ట్ పార్టీల నలుగురు ఎమ్మెల్యేలు, వీసీకే, ఐయూఎమ్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేల చొప్పున విజయ్‌కు మద్దతు ఇచ్చారు. టీవీకే పార్టీలో 107 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో విజయ్‌కు మొత్తం 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.
ఈ వార్తలనూ చదవండి:
కొలువు తీరనున్న టీవీకే ప్రభుత్వం... రేపే విజయ్ ప్రమాణస్వీకారం
రూ.100 కోట్ల మనీ లాండరింగ్ కేసు.. పంజాబ్ మంత్రి అరెస్టు