Share News

తమిళనాడులో సంచలనంగా మారిన అధికార పార్టీ TVK నేతల ఆడియో లీక్‌!

ABN , Publish Date - Jul 28 , 2026 | 10:29 AM

తమిళనాడులో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు సీఎం విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది.

తమిళనాడులో సంచలనంగా మారిన అధికార పార్టీ TVK నేతల ఆడియో లీక్‌!
TVK Audio Leak Sparks Corruption Row, Pressure Mounts on CM Vijay to Act

చెన్నై, జులై 28: తమిళనాడులో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభుత్వాన్ని అవినీతి ఆరోపణలు చుట్టుముట్టాయి. సొంత పార్టీ నేతల ఆడియో లీక్ అవ్వడం ఇప్పుడు ముఖ్యమంత్రి విజయ్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

చెన్నైలోని టీవీకే కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం దందాకు పాల్పడుతున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఆడియో లీక్‌లో, ప్రభుత్వ న్యాయవాది పోస్టు కోసం టీవీకే నేతలు 15 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు సదరు ఆడియో లీక్‌లలో వినిపిస్తోంది. అంతేకాకుండా, మహిళా న్యాయవాదులు టీవీకేలో చేరాలని ఒత్తిడి చేసినట్లు కూడా సమాచారం. కేవలం పార్టీ కార్యకర్తలకే నియామకాలంటూ టీవీకే నేతలు హుకుం జారీ చేసినట్టుగా సదరు ఆడియో లీక్స్‌లో ఉంది.


సీఎం విజయ్‌పై ఒత్తిడి

తాజా ఆడియో లీక్‌ వ్యవహారంతో సీఎం విజయ్‌పై ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో కొందరు నేతలపై చర్యలు తీసుకున్న సీఎం విజయ్, ఇప్పుడు ఈ కొత్త ఆరోపణలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షాలు సీఎం విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

టీవీకే పాలనలో అవినీతి ఎక్కువగా జరుగుతోందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం డబ్బులు వసూలు చేయడం, మహిళలపై ఒత్తిడి చేయడం వంటి చర్యలు టీవీకే పాలనలో పరిపాటిగా మారాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

సీజేపీ రాజకీయ పార్టీగా మారుతుందా.. సమాధానం ఏంటంటే..

Updated Date - Jul 28 , 2026 | 11:15 AM