Share News

1600 సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా?

ABN , Publish Date - Jul 12 , 2026 | 07:59 PM

1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల విషయంలో స్పష్టతనిస్తూ ట్రాయ్ ఇటీవల ఒక ప్రకటన విడుదల చేసింది.

1600 సిరీస్, 140 సిరీస్ ఫోన్ నెంబర్ల మద్య తేడా తెలుసా?
TRAI

ఇంటర్నెట్ డెస్క్: 1600 సిరీస్ ఫోన్ నెంబర్లు, 140 సిరీస్ ఫోన్ నెంబర్లపై ప్రజల అవగాహన పెంచేందుకు ట్రాయ్ ఇటీవల నెట్టింట ఒక పోస్టును షేర్ చేసింది. ఈ సిరీస్‌లు వేర్వేరు అవసరాల కోసం ఉద్దేశించినవని పేర్కొంది. ట్రాయ్ ప్రకటన ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు తమ కస్టమర్లను సంప్రదించేందుకు 1600 సిరీస్‌‌ను వినియోగిస్తాయి. ఆర్‌బీఐ, సెబీ, ఐఆర్‌డీఏ, పీఎఫ్ఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే సంస్థలన్నీ తమ కస్టమర్లను సంప్రదించేందుకు ఈ సిరీస్‌ను వినియోగిస్తాయి. ప్రభుత్వం కూడా ప్రజలకు సమాచారం అందించేందుకు ఈ సిరీస్‌నే వినియోగిస్తుంది. ఈ సిరీస్ ఫోన్ నెంబర్లను ట్యాగ్ చేసేందుకు, ఫిల్టర్ చేసేందుకు లేదా బ్లాక్ చేసేందుకు థర్డ్ పార్టీ యాప్‌లకు, టెలికం ఆపరేటర్లకు అనుమతి లేదు. కాల్స్‌ వచ్చే సమయంలో స్క్రీన్‌పై స్పామ్, లేదా సస్పెక్టెడ్ స్పామ్ అన్న లేబుల్స్‌ కనిపించేలా చేయడాన్ని ట్యాగింగ్ అంటారన్న విషయం తెలిసిందే.


ఇక 140 సిరీస్ ఫోన్‌ నెంబర్లను కేవలం ప్రచారం, మార్కెటింగ్ కోసం కేటాయించినట్టు ట్రాయ్ పేర్కొంది. ఈ నెంబర్‌తో మార్కెటింగ్ చేసుకోవాలని భావించిన సంస్థ ముందుగా టెలికం ఆపరేటర్ వద్ద రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కాల్స్‌ను డీఎన్‌డీ (డూ నాట్ డిస్టర్బ్) లిస్టులోకి చేర్చుకునే అవకాశం కస్టమర్లకు ఉంటుంది. ప్రమోషనల్ కాల్స్ వద్దనుకునే కస్టమర్లు డీఎన్‌డీ లిస్టులో రిజిస్టర్ చేసుకుంటే ఈ సిరీస్‌తో మొదలయ్యే నెంబర్‌ల నుంచి ఫోన్స్ రావు. అయితే, ఈ నెంబర్లను కూడా టెలికం ఆపరేటర్లు ట్యాగ్ చేయడం లేదా ఫిల్టర్ చేయడం కుదరదని ట్రాయ్ పేర్కొంది. కస్టమర్ అభ్యర్థిస్తేనే ఇలా చేయాలని స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

విరాళాల చోరీ నిందితులకు శిక్ష పడే వరకూ రెస్టు తీసుకోను: కేజ్రీవాల్

'ఆత్మహత్య చేసుకుంటా'! ఈసీ ఖురేషీతో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అన్న మాటలివి!

Updated Date - Jul 12 , 2026 | 08:10 PM