నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అత్యవసర సమావేశం
ABN , Publish Date - Sep 29 , 2026 | 02:39 AM
కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది.
జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాల్సిందే!
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ తన ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. సోమవారం దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లోని ఎన్నికల సంఘం కార్యాలయాలను ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ప్రయత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకోవటంతో పలుచోట్ల తోపులాట, ఘర్షణ చోటుచేసుకుంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఆల్కాలాంబా నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజస్థాన్‌లో మాజీ సీఎం అశోక్ గెహ్లోత్ నిరసన కార్యక్రమం జరిగింది. మహారాష్ట్రలో ముంబై, పుణె వంటి ప్రధాన నగరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. జమ్ముకశ్మీర్‌లో కూడా కాంగ్రెస్ నిరసనలు కొనసాగాయి. కాగా, జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు చట్టపరంగా, పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించేందుకు మంగళవారం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
నేరుగా ప్రధాని మోదీ రాజీనామాను అడగండి.. సీజేపీకి కేజ్రీవాల్ సలహా
ఎంపీల అనర్హత పిటిషన్ల ఆలస్యంపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు