పోలీసుల నుంచి తప్పించుకునేందుకు చీరల కింద దాక్కున్న టీఎంసీ కార్యకర్త!
ABN , Publish Date - Jun 07 , 2026 | 01:28 PM
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక టీఎంసీ కార్యకర్త చీరల కింద దాక్కున్న ఘటన పశ్చిమబెంగాల్‌లో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఒక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) కార్యకర్త చేసిన విఫలయత్నం ప్రస్తుతం వైరల్‌గా మారింది. పోలీసుల కంట పడకుండా అతడు చీరల కుప్ప కింద దాక్కునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులకు అనుమానం రావడంతో అతడి పథకం ఫెయిలయ్యింది. పోలీసులను చూసి చివరకు అతడు తెల్లముఖం వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
హౌరా జిల్లాకు చెందిన బ్రహ్మానంద చక్రవర్తిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్‌కు సంబంధించిన డబ్బుల్లో కొంత అతడు తన జేబులో వేసుకున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. వారి నుంచి తప్పించుకునేందుకు అతడు సమీపంలోని ఒక దుస్తుల దుకాణంలోకి వెళ్లాడు. అక్కడ కుప్పగా పోసి ఉన్న చీరల కింద దాక్కున్నాడు. కానీ పోలీసులకు అనుమానం వచ్చి చెక్ చేయడంతో దొరికిపోయాడు. ఏం చేయాలో పాలుపోక చివరకు తెల్లముఖం వేశాడు.
ఈ వార్తలనూ చదవండి
భారత్‌లో పడిపోయిన జననాల రేటు.. ఎలాన్ మస్క్ ఆందోళన
రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ! 11న కీలక ప్రకటన