టీఎంసీ మరో ఎంపీ కోయల్ మల్లిక్ రాజీనామా
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:43 AM
తృణమూల్ కాంగ్రెస్ చైర్ పర్సన్ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నటి, టీఎంసీ ఎంపీ కోయల్ మల్లిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు....
కోల్‌కతా, జూలై 16: తృణమూల్ కాంగ్రెస్ చైర్ పర్సన్ మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. నటి, టీఎంసీ ఎంపీ కోయల్ మల్లిక్ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం ఆమె కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆమె బీజేపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది. రాజ్యసభకు ఎన్నికైన నాలుగు నెలలకే కోయల్ రాజీనామా చేయడం గమనార్హం. తాజా రాజీనామాతో టీఎంసీ నుంచి రాజ్యసభకు రాజీనామా చేసిన ఎంపీల సంఖ్య 4కు చేరగా, పెద్దల సభలో టీఎంసీ బలం 13 నుంచి 9కి పడిపోయింది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక