Share News

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎవరికీ చెందదు!

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:05 AM

పశ్చిమబెంగాల్లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ నాయకత్వంలోని ఆ పార్టీ చీలిక వర్గానికి ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరును, ఆ పార్టీ అధికారిక గుర్తును (పూలు-గడ్డి).. ఏ వర్గం ఉపయోగించుకోకుండా ఫ్రీజ్‌ చేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎవరికీ చెందదు!
TRINAMOOL

  • పార్టీ పేరు, గుర్తును ఉపయోగించుకోకుండా ఈసీ నిషేధం

  • మమతా బెనర్జీ, రితబ్రత బెనర్జీ వర్గాలకు షాక్‌

కోల్‌కతా, సెప్టెంబర్‌ 17: పశ్చిమబెంగాల్లోని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ వర్గం, రితబ్రత బెనర్జీ నాయకత్వంలోని ఆ పార్టీ చీలిక వర్గానికి ఎన్నికల సంఘం (ఈసీ) షాకిచ్చింది. రాబోయే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ‘ఆల్‌ ఇండియా తృణమూల్‌ కాంగ్రెస్‌’ పేరును, ఆ పార్టీ అధికారిక గుర్తును (పూలు-గడ్డి).. ఏ వర్గం ఉపయోగించుకోకుండా ఫ్రీజ్‌ చేస్తూ గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ)లో నెలకొన్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ఈసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. రెండు వర్గాలు కొత్త పార్టీకి సంబంధించి చెరో మూడు పేర్లతోపాటు, ఈసీ జాబితా నుంచి మూడు గుర్తులను ఎంపిక చేసుకుని 18వ తేదీ ఉదయం 11 గంటల్లోగా తెలియజేయాలని ఆదేశించింది. దీంతో ఉప ఎన్నికల కోసం రెండు వర్గాలకు వేర్వేరు పార్టీ పేర్లు, గుర్తులను కేటాయించనుంది. అయితే, కొత్త పార్టీ పేర్ల పరంగా ఈసీ కొంత వెసులుబాటు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని నందిగ్రామ్‌, రెజినగర్‌ అసెంబ్లీ స్థానాలకు అక్టోబరు 6న జరిగే ఉప ఎన్నికల్లో ఈ రెండు ప్రత్యర్థి వర్గాలు వేర్వేరు పేర్లు, గుర్తులతో బరిలోకి దిగనున్నాయి. ఇవి తుది ఆదేశాలు కావన్నది గమనించాలి. 2026 పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీలో అంతర్గత విభేదాలు వెలుగుచూడడం తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి

385 ఎకరాల ప్రభుత్వ భూమిపై అధికారుల ఆరా.. శాటిలైట్‌ మ్యాప్‌లతో పరిశీలన

ఎన్నికల అఫిడవిట్‌తో అడ్డంగా దొరికిన కల్వకుంట్ల ముఠా!: మంత్రి పొంగులేటి

Updated Date - Sep 18 , 2026 | 04:05 AM