నన్ను సీఎం చేసేందుకు డీఎంకే, అన్నాడీఎంకే యత్నాలు
ABN , Publish Date - May 13 , 2026 | 05:02 AM
తనను సీఎం చేసేందుకు డీఎంకే-అన్నాడీఎంకే ప్రయత్నించాయని వీసీకే అధినేత తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలున్న...
వీసీకే అధినేత సంచలన ప్రకటన
చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తనను సీఎం చేసేందుకు డీఎంకే-అన్నాడీఎంకే ప్రయత్నించాయని వీసీకే అధినేత తిరుమావళవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలున్న వీసీకే మద్దతిచ్చాకే టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మందిని కూడగట్టుకోగలిగారు. తిరుమావళవన్ ఈనెల 8న పొద్దుపోయాక డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో భేటీ అయ్యారు. అయితే కాంగ్రెస్ నుంచి ఒత్తిడి రావడంతో మనసు మార్చుకుని మర్నాడు విజయ్‌కి మద్దతు పలికారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమావళవన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తనను సీఎం పీఠంపై కూర్చోబెట్టేందుకు డీఎంకే-అన్నాడీఎంకే సన్నాహాలు చేసినట్లు సన్నిహితుల నుంచి వర్తమానం అందిందని చెప్పారు. అయితే తనతో ఎవరూ నేరుగా మాట్లాడలేదన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క
తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..
Read Latest Telangana News And AP News And International News And Telugu News