Share News

తెలంగాణ నుంచి రూ.448 కోట్ల విలువైన పంట కొనుగోళ్లు

ABN , Publish Date - Oct 01 , 2026 | 05:21 AM

తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల రైతుల నుంచి 2026-27 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ)పై రూ.5,548 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆమోదం తెలిపారు

తెలంగాణ నుంచి   రూ.448 కోట్ల విలువైన పంట కొనుగోళ్లు

  • కనీస మద్దతు ధరపై సోయాబీన్‌, పెసరపప్పు సేకరణ

  • ఆమోదం తెలిపిన కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల రైతుల నుంచి 2026-27 ఖరీఫ్‌ మార్కెటింగ్‌ సీజన్‌లో కనీస మద్దతు ధర(ఎంఎస్ పీ)పై రూ.5,548 కోట్ల విలువైన పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఆమోదం తెలిపారు. ఇందులో తెలంగాణ రైతుల నుంచి రూ.448.42 కోట్ల విలువైన పంట ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నారు. ధరల మద్దతు పథకం (పీఎ్‌సఎస్‌) కింద ఈ కొనుగోళ్లు చేపట్టనున్నారు. తెలంగాణ రైతుల నుంచి రూ.353.90 కోట్ల విలువైన 62 వేల మెట్రిక్‌ టన్నుల సోయాబీన్‌, రూ.94.52 కోట్ల విలువైన 10,766 మెట్రిక్‌ టన్నుల పెసరపప్పు సేకరించనున్నారు. ఇక ఉత్తరప్రదేశ్‌ రైతుల నుంచి రూ.3,992.57 కోట్ల విలువైన, కర్ణాటక రైతుల నుంచి రూ.1,107 కోట్ల విలువైన పప్పుధాన్యాలు, నూనెగింజల కొనుగోళ్లు చేపట్టనున్నారు. తమ నిర్ణయం రైతులకు మరింత ఆర్థిక భద్రతను కల్పిస్తుందని.. దేశంలో పప్పుధాన్యాలు, నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుందని మంత్రి శివరాజ్‌సింగ్‌ అన్నారు.. పప్పుధాన్యాలు, వంట నూనెల్లో భారత్‌ స్వయం సమృద్థి సాధించే ప్రయత్నాలకూ ఇది దోహదపడుతుందన్నారు. కొనుగోళ్లు పారదర్శకంగా ఉంటాయనీ, పంటకు సంబంధించిన చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయని చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి

రష్యా సైన్యంలో చేరొద్దు.. భారతీయులకు కేంద్రం హెచ్చరిక

డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడా: ప్రధాని మోదీ

Updated Date - Oct 01 , 2026 | 05:23 AM