Share News

తెలంగాణకు 3,825 కోట్ల ఉపాధి నిధులు

ABN , Publish Date - Jun 12 , 2026 | 05:44 AM

దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు....

తెలంగాణకు 3,825 కోట్ల ఉపాధి నిధులు

  • కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌తో కిషన్‌రెడ్డి భేటీ

న్యూఢిల్లీ, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమావేశమయ్యారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్న వికసిత్‌ భారత్‌-గ్యారంటీ ఫర్‌ రోజ్‌ గార్‌ స్కీమ్‌(వీబీజీరాంజీ) పథకాన్ని తెలంగాణలో సజావుగా అమలు చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించారు. 2026-27లో తెలంగాణ గ్రామీణ ప్రజల కోసం 8.50 కోట్ల పనిదినాలకు కేంద్రం ఆమోదం తెలిపిందని, ఇప్పటికే ఇందులో 4.38 కోట్ల పనిదినాలు పూర్తవగా, రూ.1,163.64 కోట్ల నిధులను ఖర్చు చేసి 11,684 పనులను పూర్తి చేసినట్లు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు. సమావేశానంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వీబీజీరాంజీ కింద 2026-27కి గానూ.. తెలంగాణకు రూ.3,825.31 కోట్ల నిధులను కేటాయించినట్లు శివరాజ్‌ సింగ్‌ తెలియజేశారన్నారు.

ఇవి కూడా చదవండి..

పెరిగిన క్రూడాయిల్ ధరలు.. సూచీలకు నష్టాలు..

మాతో ఉంటారా.. అభిషేక్‌తో ఉంటారా.. మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం..

Updated Date - Jun 12 , 2026 | 05:44 AM