టీసీఎస్‌లో 8900 ఏఐ డెప్లాయ్‌మెంట్ ఇంజనీర్లు
ABN , Publish Date - Jul 13 , 2026 | 05:52 AM
దేశంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’(టీసీఎస్).. తమ మొత్తం ఉద్యోగుల్లో..
సంస్థ ఉద్యోగుల్లో 1.5ు మందిని తీర్చిదిద్దేందుకు
ప్రణాళికలు.. సీఈవో కృతివాసన్ వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 12: దేశంలోని అతి పెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’(టీసీఎస్).. తమ మొత్తం ఉద్యోగుల్లో 1 నుంచి 1.5ు మంది(8,900మంది) ఏఐ డెప్లాయ్‌మెంట్ ఇంజనీర్స్/ఫార్వర్డ్ డెప్లాయ్‌డ్ ఇంజనీర్లు (ఎఫ్‌డీఈలు) ఉండేలా ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో కృత్తివాసన్ తెలిపారు. ఈ ఫార్వర్డ్ డెప్లాయ్‌డ్ ఇంజనీర్లు నేరుగా క్లయింట్లతో కలిసి పనిచేస్తూ వారి వ్యాపార అవసరాలకు తగ్గట్టుగా ఏఐ టూల్స్‌ను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తారు. అయితే, ఇందుకోసం ఇప్పటికే సంస్థలో ఉన్నవారికి శిక్షణ ఇస్తుందా? లేక కొత్తవారిని నియమించుకుంటుందా? అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. అంతేకాదు.. 2025 దాకా సొంతంగా ఎదగడంపైనే దృష్టిపెట్టిన టీసీఎస్.. కొత్తగా ఏఐ, డేటా సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ కంపెనీల కొనుగోలుపై దృష్టి సారించింది.
Also Read:
వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.. భారతీయుడి గల్లంతు