Share News

ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ-బ్రహ్మీ శాసనాలు

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:30 AM

పురాతన తమిళ వ్యాపారులు 2 వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టులో ప్రయాణించారని నిర్ధారించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈజిప్టులోని రాజ సమాధుల్లో...

ఈజిప్టు పిరమిడ్‌లలో తమిళ-బ్రహ్మీ శాసనాలు

  • ఎనిమిది చోట్ల తమిళ వాణిజ్యవేత్త పేరు

  • స్విట్జర్లాండ్‌ ప్రొఫెసర్‌ అధ్యయనంలో వెల్లడి

చెన్నై, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): పురాతన తమిళ వ్యాపారులు 2 వేల సంవత్సరాల క్రితమే ఈజిప్టులో ప్రయాణించారని నిర్ధారించే కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ఈజిప్టులోని రాజ సమాధుల్లో 2 వేల సంవత్సరాల నాటి తమిళ-బ్రహ్మీ శాసనాలు, ఐదు వేర్వేరు పిరమిడ్లలో ‘సిగై కొట్రాన్‌’ అనే తమిళ వాణిజ్యవేత్త పేరు ఎనిమిది సార్లు చెక్కి ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. చెన్నైలో తమిళ ఎపిగ్రఫీపై బుధవారం ప్రారంభమైన నాలుగు రోజుల సదస్సులో స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌ యూనివర్సిలీ ప్రొఫెసర్‌ ఇంగో స్ట్రౌచ్‌ ఈ వివరాలు వెల్లడించారు. పారి్‌సలోని ఫ్రెంచ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆసియన్‌ స్టడీస్‌ ప్రొఫెసర్‌ షార్లెట్‌ ష్మిడ్‌తో కలిసి ఆయన ఈజిప్టు పిరమిడ్‌లపై అధ్యయనం చేశారు. ఇక్కడి పిరమిడ్‌లలోని ఆరు రాతి సమాధుల్లో తమిళ బ్రహ్మీ, ఆరు పాకృత భాషల్లో సుమారు 30 శాసనాలను వారు గుర్తించారు. కాగా, ఈ శాసనాలు ప్రాచీన కాలంలో ప్రపంచ వాణిజ్యపటంలో తమిళులు ప్రధాన పాత్ర పోషించినట్టు రుజువు చేస్తున్నాయని తమిళనాడు ఆర్థిక మంత్రి తంగం తెన్నరసు అన్నారు.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:30 AM