ప్రభుత్వం కూల్చివేతకు 180 కోట్లు?
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:10 AM
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు ఏకంగా రూ.180 కోట్లు కేటాయించారని, ఓ కార్పొరేట్ సంస్థ దీనికి...
ఓ కార్పొరేట్ సంస్థ పక్కా వ్యూహం
మాజీ మంత్రి ఆదేశంతో బేరసారాలు
పోలీసుల విచారణలో నిందితుల వెల్లడి
చెన్నై, జూలై 3(ఆంధ్రజ్యోతి): తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు ఏకంగా రూ.180 కోట్లు కేటాయించారని, ఓ కార్పొరేట్ సంస్థ దీనికి సంబంధించి వ్యూహరచన చేసిందని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన వ్యక్తులు విచారణలో చెప్పినట్టు తెలిసింది. స్థానిక గిండిలోని ఓ హోటల్లోనే ఈ వ్యూహరచన జరిగిందని, తాము కూడా అక్కడ వారం రోజుల పాటు బస చేశామని వారు వెల్లడించినట్లు సమాచారం. యూట్యూబర్ తిరునావుక్కరసు, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన తమ్ముడు అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు తాము ఈ బేరసారాలు సాగించినట్లు వారు అంగీకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. టీవీకే ప్రభుత్వం కూల్చివేతకు సహకరిస్తే రూ.35 కోట్లు ఇస్తామంటూ ఓ యూట్యూబర్ తనను సంప్రదించాడని టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇటీవల పోలీసులకు ఫి ర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, ఆయన సోదరుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..