Share News

సర్టిఫికెట్ మర్చిపోయిన మినిస్టర్ కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

ABN , Publish Date - May 11 , 2026 | 01:41 PM

మినిస్టర్ కీర్తన తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆమె ఎలక్షన్ సర్టిఫికెట్‌ను అసెంబ్లీకి తీసుకురాకపోవటంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.

సర్టిఫికెట్ మర్చిపోయిన మినిస్టర్ కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..
Keerthana Assembly oath

చెన్నై, మే 11: తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్‌తో పాటు మంత్రులు.. ఎమ్మెల్యేలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మినిస్టర్ కీర్తన మాత్రం ప్రమాణ స్వీకారం చేయలేదు. ఆమె ఎలక్షన్ సర్టిఫికెట్‌(ధ్రువీకరణ పత్రం)ను అసెంబ్లీకి తీసుకురాకపోవటంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. అసెంబ్లీలో ప్రమాణం స్వీకారం చేసే ఎమ్మెల్యేలందరూ ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకురావాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించే సమయంలో ఆ ధ్రువీకరణ పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ ఉన్న వారినే ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మినిస్టర్ కీర్తన వద్ద సర్టిఫికెట్ లేకపోవటంతో ప్రమాణ స్వీకారం వాయిదా పడింది.


కీర్తన మన తెలుగమ్మాయే..

కీర్తన పూర్వీకులు ఆంధ్రా నుంచి తమిళనాడుకు వెళ్లి విరుదునగర్‌లో సెటిల్‌ అయ్యారు. కీర్తన గతంలో తెలుగుదేశంతో పాటు పలు రాష్ట్రాల్లోని ఇతర పార్టీలకు ఎన్నికల ప్రచార సలహాదారుగా, వ్యూహకర్తగా పని చేశారు. తన ప్రతిభతో టీవీకే అధినేత విజయ్ దృష్టిని ఆకర్షించారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఆమెకు శివకాశి టికెట్ ఇచ్చారు. దశాబ్దాల చరిత్రను తిరగరాస్తూ కీర్తన శివకాశి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. నిన్న మినిస్టర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. 1996లో విరుదునగర్‌లో జన్మించిన కీర్తన ఐదు భాషలు అనర్గళంగా మాట్లాడగలరు.


ఇవి కూడా చదవండి

కోట్లకు పడగలెత్తిన ఓపెన్ ఏఐ ఉద్యోగులు! సిలికాన్ వ్యాలీలో అరుదైన ఘటన

విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత త్రిష తొలి పోస్ట్.. ఏమన్నారంటే?

Updated Date - May 11 , 2026 | 03:39 PM