Share News

విజయ్‌కు గవర్నర్‌ ఝలక్‌!

ABN , Publish Date - May 07 , 2026 | 06:32 AM

టీవీకే అధినేత విజయ్‌కు తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ ఝలక్‌ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన...

విజయ్‌కు గవర్నర్‌ ఝలక్‌!

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని

చూపించాలన్న అర్లేకర్‌.. విజయ్‌ ప్రమాణంపై అస్పష్టత

చెన్నై, మే 6(ఆంధ్రజ్యోతి): టీవీకే అధినేత విజయ్‌కు తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ ఝలక్‌ ఇచ్చారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే.. అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన సంఖ్యాబలం లేకపోవడంతో ముందు మెజారిటీ చూపించాలని గవర్నర్‌ తేల్చి చెప్పారు. గవర్నర్‌ అర్లేకర్‌తో బుధవారం సాయంత్రం విజయ్‌ భేటీ అయ్యారు. తన సహచరులైన బుస్సీ ఆనంద్‌, అధవ్‌ అర్జున, సెంగోట్టయ్యన్‌ తదితరులతో కలిసి లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్‌.. తమ పార్టీ నుంచి గెలిచిన 107(విజయ్‌ రెండు స్థానాల్లో గెలిచారు) మంది ఎమ్మెల్యేల జాబితాను అందించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల వివరాలను అందించాలని గవర్నర్‌ స్పష్టం చేశారు. దీంతో విజయ్‌ సందిగ్ధంలో పడ్డారు. మరోవైపు.. టీవీకేకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించినా 113 మంది ఎమ్మెల్యేలే విజయ్‌కు మద్దతుగా నిలిచినట్టయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118ని చేరుకునేందుకు మరో ఆరుగురు ఎమ్మెల్యేల అవసరం ఏర్పడింది. ఫలితంగా గురువారం.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ముందుగా నిర్ణయించున్నప్పటికీ.. సంఖ్యా బలం లేకపోవడం, గవర్నర్‌ ఆ విషయాన్నే ప్రస్తావించడంతో ప్రమాణస్వీకార ఘట్టం సందేహంగా మారింది. మరోవైపు నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి..

విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు

సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ

Updated Date - May 07 , 2026 | 06:39 AM