టీవీకేకు చాన్సివ్వడమంటే ఫిరాయింపులను ప్రోత్సహించడమే!
ABN , Publish Date - May 07 , 2026 | 07:10 AM
రాజ్యాంగ నిపుణులు, సలహాదారుల సూచన మేరకే తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన బలం లేనప్పటికీ ప్రభుత్వ...
గవర్నర్‌కు రాజ్యాంగ నిపుణుడు బన్సోడే సలహా
న్యూఢిల్లీ, మే 6 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగ నిపుణులు, సలహాదారుల సూచన మేరకే తమిళనాడు గవర్నర్ అర్లేకర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైన బలం లేనప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ పార్టీకి అవకాశమిస్తే... ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించినట్లవుతుందని, ఇది రాజ్యాంగాధిపతికి సరైంది కాదని గవర్నర్‌కు సలహాదారులు స్పష్టం చేసినట్లు సమాచారం. పలు రాష్ట్రాల గవ ర్నర్లకు సలహాదారుగా ఉన్న వికాస్ బన్సోడేను తమిళనాడు గవర్నర్ అర్లేకర్ చెన్నైకి పిలిపించుకుని సలహా కోరినట్లు సమాచారం. ‘‘స్థిరమైన ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం లేకపోతే ఎవరినీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకూడదు. విజయ్ వద్ద సంఖ్యాబలం లేదు. అందువల్ల ప్రభుత్వం ఏర్పా టు చేసేందుకు ఆయనను ఆహ్వానించాల్సిన అవసరం లేదు’’ అని బన్సోడే సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ అనిశ్చితికి తెరపడకపోతే తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాల్సి రావచ్చునని అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
విజయ్ టీవీకేతో కాంగ్రెస్ పొత్తుపై కనిమొళి కీలక వ్యాఖ్యలు
సంఖ్యా బలం కావాలి.. విజయ్‌కు గవర్నర్ అనుమతి నిరాకరణ