Share News

ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థల వద్ద

ABN , Publish Date - May 13 , 2026 | 05:04 AM

తమిళ రాజకీయాల్లో సంచలనాలు రేపుతూ, ముఖ్యమంత్రి పీఠమెక్కిన విజయ్‌.. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ అదే పంథా కొనసాగిస్తున్నారు. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలకు...

ప్రార్థనా స్థలాలు, విద్యా సంస్థల వద్ద

మద్యం దుకాణాలు బంద్‌

  • తమిళనాడు సీఎం విజయ్‌ ఉత్తర్వులు

  • ముఖ్యమంత్రి ఓఎ్‌సడీగా జ్యోతిష్కుడు వెట్రివేల్‌

  • ప్రభుత్వ విప్‌గా డ్రైవర్‌ కుమారుడు శబరినాథన్‌

చెన్నై, మే 12 (ఆంధ్రజ్యోతి): తమిళ రాజకీయాల్లో సంచలనాలు రేపుతూ, ముఖ్యమంత్రి పీఠమెక్కిన విజయ్‌.. ప్రభుత్వ నిర్ణయాల్లోనూ అదే పంథా కొనసాగిస్తున్నారు. ప్రార్థనాస్థలాలు, విద్యాసంస్థలకు 500 మీటర్ల దూరంలో ఉన్న తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్‌ కార్పొరేషన్‌(టాస్మాక్‌) మద్యం దుకాణాలను రెండు వారాల్లోగా మూసివేయాలని మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్‌లకు చేరువగా ఉన్న 717 టాస్మాక్‌ మద్యం దుకాణాలను మూసివేయాలని, రెండు వారాల్లోగా ఆయా ప్రాంతాలను ఖాళీ చేయాలని ఆదేశించారు. మరోవైపు.. విజయ్‌ తన వ్యక్తిగత జ్యోతిష్కుడు రాధాన్‌ పండిట్‌ వెట్రివేల్‌ను ‘ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ’ (ఓఎ్‌సడీ-రాజకీయ వ్యవహారాలు)గా, తన కారు డ్రైవర్‌ కుమారుడు, విరుగంబాక్కం టీవీకే ఎమ్మెల్యే శబరినాథన్‌(30)ను అసెంబ్లీలో ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. అయితే, వెట్రివేల్‌ నియామకాన్ని మిత్రపక్షాలైన కాంగ్రెస్‌, సీపీఎం, వీసీకే తప్పుబట్టాయి. సీఎం విజయ్‌ సైన్స్‌ పట్ల అవగాహన పెంచుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం వ్యాఖ్యానించారు. లౌకిక ప్రభుత్వంలో ఈ నియామకం ఆమోదయోగ్యం కాదని వీసీకే ప్రధాన కార్యదర్శి డి.రవికుమార్‌ అన్నారు. వెట్రివేల్‌ దీర్ఘకాలంగా విజయ్‌కు జోస్యం చెబుతూ వస్తున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి...

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క

తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మి..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 13 , 2026 | 05:04 AM