బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కంచె
ABN , Publish Date - May 12 , 2026 | 05:36 AM
పశ్చిమబెంగాల్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ పార్టీ ఎన్నికల హామీల్లో కీలకమైన మిగిలిన...
45 రోజుల్లో బీఎ్‌సఎ్‌ఫకు భూమి
సువేందు మంత్రివర్గం నిర్ణయం
కోల్‌కతా, మే 11: పశ్చిమబెంగాల్‌లో తొలిసారిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. తొలి క్యాబినెట్ సమావేశంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంది. తమ పార్టీ ఎన్నికల హామీల్లో కీలకమైన మిగిలిన బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ (కంచె) ఏర్పాటు కోసం బీఎ్‌సఎ్‌ఫకు అవసరమైన భూమిని బదిలీ చేయడానికి సువేందు అధికారి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు భద్రత, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నియంత్రించడంలో భాగంగా భూమి బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి, 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. భూమి బదిలీ ప్రక్రియ పూర్తయిన తర్వాత, బీఎ్‌సఎఫ్ మిగిలిన సరిహద్దు కంచె నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని, తద్వారా అక్రమ చొరబాట్ల సమస్య తక్కువ సమయంలోనే పరిష్కారమవుతుందని బెంగాల్ సీఎం సువేందు అధికారి చెప్పారు. తొలి క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్, పీఎంశ్రీ, పీఎం జన ఆరోగ్య యోజన, పీఎం ఫసల్ బీమా యోజన, పీఎం విశ్వకర్మ సహా ఇతర కేంద్ర పథకాల అమలుకు ఆమోదం తెలిపారు. సోమవారం నుంచే రాష్ట్రం బీఎన్‌ఎస్ చట్టాన్ని అమలు చేస్తుందని వెల్లడించారు. గత ప్రభుత్వం ఆలస్యం చేసిన జనగణన ప్రక్రియను కూడా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కొత్త ప్రభుత్వం ప్రస్తుతమున్న ఏ రాష్ట్ర పథకాన్ని ఆపివేయదని, అయితే అనర్హులను, మరణించిన వారిని, భారతీయులు కాని వారిని గుర్తించి ఏరివేస్తామని సువేందు స్పష్టం చేశారు. కాగా, బంగ్లాదేశ్‌తో పశ్చిమబెంగాల్ 2217 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 569 కిలోమీటర్ల మేర ఇంకా ఫెన్సింగ్ వేయలేదు.
ఇవి కూడా చదవండి..
మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..
సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్