Share News

తరుణ్‌ తేజ్‌పాల్‌ రెండు వారాల్లో లొంగిపోవాలి: సుప్రీంకోర్టు

ABN , Publish Date - Aug 25 , 2026 | 02:15 PM

సహోద్యోగినిపై లైంగికదాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తరుణ్‌ తేజ్‌పాల్‌ రెండు వారాల్లో లొంగిపోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.

తరుణ్‌ తేజ్‌పాల్‌ రెండు వారాల్లో లొంగిపోవాలి: సుప్రీంకోర్టు
SC directs convict Tarun Tejpal

ఇంటర్‌నెట్ డెస్క్: సహోద్యోగినిపై లైంగికదాడి కేసులో తెహల్కా మాజీ ఎడిటర్‌ తరుణ్‌ తేజ్‌పాల్‌‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తరుణ్‌ తేజ్‌పాల్‌ రెండు వారాల్లో లొంగిపోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. శిక్షపై అప్పీల్‌‌ను తర్వాత విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సెప్టెంబర్ 22వ తేదీలోగా సరెండర్ సర్టిఫికెట్ కోర్టులో సబ్‌మిట్ చేయాలని ఆదేశించింది. మెరిట్ ఆధారంగా తదుపరి విచారణ చేపడతామని కోర్టు పేర్కొంది.


కేసు వివరాలు..

2013 నవంబర్ నెలలో గోవాలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో జరిగిన ‘థింక్‌ ఫెస్ట్’ ఈవెంట్‌ సందర్భంగా లిఫ్ట్‌లో జూనియర్‌ సహోద్యోగినిపై లైంగికదాడికి పాల్పడిన కేసులో తేజ్‌పాల్‌‌‌ను బాంబే హైకోర్టు దోషిగా తేల్చింది. ఐదేళ్ల క్రితం తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవా సెషన్స్‌ కోర్టు వెలువరించిన తీర్పును బాంబే హైకోర్టు కొట్టివేసింది. ఆయనకు పదేళ్ల కఠిన జైలు శిక్ష, రూ.10.21 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై తేజ్‌పాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మంగళవారం తేజ్‌పాల్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ అలోక్ అరాధే విచారణ జరిపారు. శిక్షపై అప్పీల్‌‌ను తర్వాత విచారిస్తామని, రెండు వారాల్లో లొంగిపోవాలని తరుణ్‌ తేజ్‌పాల్‌‌ను ఆదేశించారు.


ఇవి కూడా చదవండి

వైరల్ రీల్ కోసం ‘కిస్సింగ్ కార్’.. యువకుడికి జరిమానా.!

ఏపీ-యూకే కీలక ఒప్పందం.. అమరావతి వేదికగా ఎంఓయూపై సంతకాలు

Updated Date - Aug 25 , 2026 | 02:36 PM