Share News

ఉన్నత విద్యను దాచిపెట్టి అంతకన్నా తక్కువ అర్హత ఉద్యోగం పొందితే చెల్లదు!

ABN , Publish Date - Jun 04 , 2026 | 06:07 AM

తక్కువ స్థాయి విద్యార్హతలున్న కొలువులకు సంబంధించి, ఎక్కువ చదువుకున్న విషయాన్ని దాచిపెట్టి, ఉద్యోగాల్లో చేరితే అది చట్టవిరుద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది...

ఉన్నత విద్యను దాచిపెట్టి అంతకన్నా తక్కువ అర్హత ఉద్యోగం పొందితే చెల్లదు!

  • అలా చేస్తే నిజమైన అర్హుల అవకాశాలను హరించడమే: సుప్రీం

  • డిగ్రీ అర్హతను దాచి బ్యాంకు అటెండర్‌ కొలువు పొందిన యువకుడిని తొలగించడం సమర్ధనీయమేనని తీర్పు

న్యూఢిల్లీ, జూన్‌ 3: తక్కువ స్థాయి విద్యార్హతలున్న కొలువులకు సంబంధించి, ఎక్కువ చదువుకున్న విషయాన్ని దాచిపెట్టి, ఉద్యోగాల్లో చేరితే అది చట్టవిరుద్ధమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రత్యేకించి తక్కువ విద్యార్హతలున్నవారి కోసం ప్రకటించిన ఉద్యోగాలను ఎక్కువ విద్యార్హత ఉన్నవారు సంపాదిస్తే అది తక్కువ విద్యార్హతలున్న, నిరుపేద అభ్యర్థుల అవకాశాలను దెబ్బతీసినట్లే అవుతుందని పేర్కొంది. డిగ్రీ పాసైన ఓ యువకుడు, ఆ విషయాన్ని దాచిపెట్టి పదోక్లాసు మాత్రమే పాసయ్యానంటూ చెప్పి సిండికేట్‌ బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండర్‌ ఉద్యోగాన్ని సంపాదించాడు. గుర్తించిన బ్యాంకు అధికారులు, ఆ యువకుడిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై ఆ యువకుడు మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా అతడికి అక్కడ అనుకూలంగా తీర్పు వచ్చింది. దీన్ని తాజాగా జస్టిస్‌ ఎహసానుద్దీన్‌ అమానుల్లా, జస్టిస్‌ ఆర్‌ మహదేవ్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది. సదరు ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు మేనేజ్‌మెంట్‌ తీసుకున్న నిర్ణయాన్ని అత్యున్నత న్యాయస్థానం సమర్ధించింది.. ఎక్కువ చదువుకున్నవారు, తక్కువ విద్యార్హతలున్న ఉద్యోగాల కోసం పోటీపడితే తక్కువగా చదువుకున్నవారికి అసలు అవకాశాలే దొరకవు అని ధర్మాసనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన

గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..

Updated Date - Jun 04 , 2026 | 06:07 AM