గుర్రంగూడ భూములకు సుప్రీం రక్ష
ABN , Publish Date - Apr 29 , 2026 | 06:33 AM
రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ భూములపై దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. వివాదాస్పద 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్ ఫారె్‌స్ట’గా...
రిజర్వ్ ఫారె్‌స్టగా ఖరారు చేస్తూ తెలంగాణ నోటిఫికేషన్
రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి నివేదికకు సుప్రీంకోర్టు ఆమోదం
సాలార్‌జంగ్ వారసుల భూవివాదానికి శాశ్వత ముగింపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ అటవీ భూములపై దశాబ్దాలుగా కొనసాగుతున్న సుదీర్ఘ న్యాయపోరాటానికి తెరపడింది. వివాదాస్పద 102 ఎకరాల భూమిని ‘రిజర్వ్ ఫారె్‌స్ట’గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తుది నోటిఫికేషన్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభు త్వం సమర్పించిన సమ్మతి నివేదికను అత్యున్నత న్యాయస్థానం ఆమోదించడంతో సాలార్‌జంగ్ వారసుల దశాబ్దాల క్లెయిమ్‌లకు చెక్ పడటమే కాకుండా ఈ విలువైన అటవీ సంపదకు శాశ్వత ‘సుప్రీం’ రక్షణ లభించింది. 2025 డిసెంబర్ 18న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల నివేదికను (కంప్లయన్స్ రిపోర్ట్) జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టి నేతృత్వంలోని జస్టిస్ విజయ్ బిష్ణోయ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆమోదించింది.
రిజర్వ్ ఫారె్‌స్టగా మార్చేశాం: తెలంగాణ
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ 102 ఎకరాలతో పాటు మొత్తం 424 ఎకరాలను రిజర్వ్ ఫారె్‌స్టగా మార్చేశామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు విన్నవించారు. 2025 డిసెంబరు 18న సుప్రీం ఇచ్చిన తీర్పులోని పేరా 34 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రాష్ట్ర పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ 2026మార్చి 9న అధికారిక ఉత్తర్వులు జారీ చేసినట్లు వివరించారు. తెలంగాణ తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి రాష్ట్ర ప్రభుత్వం అందించిన నివేదికను ఆమోదిస్తున్నట్లు చెబుతూ, ఆ పిటిషన్‌ను పరిష్కరిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
అసలు ఏమిటీ వివాదం
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం సాహెబ్‌నగర్ కలాన్‌లోని సర్వే నం.201/1లోని 102 ఎకరాల భూమిపై మీర్ జాఫర్ అలీ ఖాన్ (సాలార్‌జంగ్-3 వారసులు) తదితరులు హక్కులు కోరుతూ వచ్చారు. 1832 నాటి కొనుగోలు పత్రాల ఆధారంగా ఇది తమ స్వార్జిత ఆస్తి అని, జాగీర్ల రద్దు చట్టం దీనికి వర్తించదని వాదించారు. 2014లో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ వీరి వాదనతో ఏకీభవిస్తూ, ఈ భూమిని అటవీ నోటిఫికేషన్‌నుంచి మినహాయించాలని ఆదేశించారు. దీన్ని జిల్లా కోర్టు, హైకోర్టు సైతం సమర్థించాయి. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ అటవీశాఖ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సాలార్‌జంగ్ వారసుల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు జస్టిస్ పంకజ్ మిట్టల్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.వి.ఎన్. భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం 2025డిసెంబరు 18న తీర్పు వెలువరించింది. 1949లో జాగీర్ల రద్దు రెగ్యులేషన్ వచ్చినప్పుడే ఆ భూములు ప్రభుత్వంలో అంతర్భాగమయ్యాయని సుప్రీం తేల్చిచెప్పింది. ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ తన పరిధిని అతిక్రమించి ప్రభుత్వభూమిని ప్రైవే టు వ్యక్తులకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇవి కూడా చదవండి..
గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..
న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..