Share News

వారానికే ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన జీవరాజ్‌

ABN , Publish Date - May 12 , 2026 | 04:57 AM

చిక్కమగళూరు జిల్లా శృంగేరి శాసనసభ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వివాదంలో సుప్రీంకోర్టు ‘యథాతథస్థితి’ ఆదేశాలు ఇచ్చింది. దీంతో...

వారానికే ఎమ్మెల్యే పదవిని కోల్పోయిన జీవరాజ్‌

  • శృంగేరి ఎన్నికల వివాదంలో యథాతథస్థితికి సుప్రీం ఆదేశం

బెంగళూరు, మే 11 (ఆంధ్రజ్యోతి): చిక్కమగళూరు జిల్లా శృంగేరి శాసనసభ ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు వివాదంలో సుప్రీంకోర్టు ‘యథాతథస్థితి’ ఆదేశాలు ఇచ్చింది. దీంతో బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌.. వారానికే ఎమ్మెల్యే పదవిని కోల్పోయారు. 2023 మేలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేగౌడ గెలుపొందారు. అయితే పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపులో తప్పిదం జరిగిందని బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు జరిగిన పోస్టల్‌ ఓట్ల రీ కౌంటింగ్‌లో బీజేపీ అభ్యర్థి జీవరాజ్‌ గెలుపొందినట్టు ఎన్నికల అధికారి ప్రకటించారు. దీంతో శాసనసభ స్పీకర్‌ ఆయనచేత ప్రమాణస్వీకారం చేయించారు. వారం రోజులపాటు జీవరాజ్‌ ఎమ్మెల్యేగా కొనసాగారు. దీనిపై రాజేగౌడ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలో ద్విసభ్య ధర్మాసనం సోమవారం ఈ పిటిషన్‌ను విచారించి, యథాతథస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 09:31 AM