విద్వేష ప్రసంగాల నియంత్రణకు ప్రస్తుత చట్టాలు చాలు
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:06 AM
విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న నేర నియంత్రణ చట్టాలు సరిపోతాయని, తాము కొత్తగా మార్గదర్శకాలు ఇవ్వాల్సిన...
కొత్తగా కోర్టు మార్గదర్శకాలు అవసరం లేదు: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: విద్వేష ప్రసంగాల నియంత్రణ కోసం ప్రస్తుతం ఉన్న నేర నియంత్రణ చట్టాలు సరిపోతాయని, తాము కొత్తగా మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడేవారిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకుంటే.. పైస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం చట్టాల్లో ఉందని గుర్తుచేసింది. విద్వేష ప్రసంగాల నియంత్రణకు మరిన్ని మార్గదర్శకాలు ఇవ్వాలని దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. చట్టసభలు చేసిన చట్టాలను కోర్టులు సమీక్షిస్తాయే తప్ప.. సొంతంగా చట్టాలు చేయటం, చట్టాలు చేయాలని శాసన వ్యవస్థను ఆదేశించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదని గుర్తుచేసింది. విద్వేష ప్రసంగాలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సీఆర్‌పీసీ సెక్షన్ 156(3) (బీఎన్‌ఎ్‌సఎ్‌స సెక్షన్ 175 (3)) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించేందుకు ముందస్తు అనుమతి అవసరం లేదని వివరిస్తూ.. ఫిర్యాదులపై పోలీసులు స్పందించకపోతే ఏం చేయాలన్న విషయాన్ని కూడా సీఆర్‌పీసీ, బీఎన్‌ఎ్‌సఎ్‌స చట్టాల్లో స్పష్టంగా పొందుపర్చారని గుర్తుచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News