ఎస్సీ ఎస్టీ చట్ట సవరణను వ్యతిరేకించిన పిల్ కొట్టివేత
ABN , Publish Date - Sep 23 , 2026 | 04:15 AM
ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టంలో 2018లో చేసిన సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) విచారణకు తీసుకోవటానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసిన సదరు సవరణలను 2020లో సుప్రీంకోర్టు సమర్థించిందని, కాబట్టి, ఇప్పుడు వాటిపై విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది
విచారణకు తీసుకోవటానికి సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టంలో 2018లో చేసిన సవరణలను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) విచారణకు తీసుకోవటానికి సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎస్సీ ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసిన సదరు సవరణలను 2020లో సుప్రీంకోర్టు సమర్థించిందని, కాబట్టి, ఇప్పుడు వాటిపై విచారణ అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు బ్రిజ్‌భూషణ్ సైనీ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చీ, జస్టిస్ వీ మోహనల ధర్మాసనం మంగళవారం తోసిపుచ్చింది. ఎస్సీ, ఎస్టీ చట్టం దుర్వినియోగాన్ని అరికట్టాలన్న సైనీ వాదనలను కోర్టు అంగీకరించలేదు. ఆ చట్టం దుర్వినియోగం కాకుండా తగిన రక్షణలు ఇప్పటికే ఉన్నాయని తెలిపింది. కాగా, 2018లో ఎస్సీ ఎస్టీ చట్టం ప్రయోగానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక దర్యాప్తు జరిపి నేరం జరిగింది నిజమేనని రుజువు చేసుకోవాలని, నిందితులకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వవచ్చని, ఈ చట్టం కింద ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగిని అరెస్టు చేయాలంటే సంబంధిత అధికారి అనుమతి తీసుకోవాలని నాడు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ తీర్పుతో ఎస్సీ ఎస్టీ చట్టం బలహీనపడుతుందని అప్పట్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో, అదే ఏడాది పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని సవరించారు. దీనిప్రకారం చట్టంలో కొత్తగా సెక్షన్ 18ఏను జోడించారు. ఎఫ్‌ఐఆర్ నమోదుకు ముందు ప్రాథమిక విచారణ అవస రంలేదని, నిందితులకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి వీల్లేదని, అ లాగే నిందితుల అరెస్టుకు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన పనిలేదని ఈ సెక్షన్ స్పష్టం చేసింది. తద్వారా సుప్రీంకోర్టు తీర్పును ఈ చట్టసవరణతో కేంద్రం పక్కనపెట్టినట్లయ్యింది. 2020లో ‘పృథ్వీరాజ్ చౌహాన్-కేంద్రప్రభుత్వం’ కేసులో సెక్షన్ 18ఏను సుప్రీంకోర్టు స్వయంగా సమర్థించింది.
ఈ వార్తలను చదవండి
వీధిలో డీజే.. గుండెపోటుతో 2వ తరగతి బాలిక మృతి
వైభవంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం.. తెలుగు చిత్రాలకు 9 అవార్డులు