Share News

అమెరికా తరహా వైద్య సేవలు ఇక్కడా ఉన్నాయి

ABN , Publish Date - Jun 08 , 2026 | 06:11 AM

చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఒక కేసులో నిందితుడు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమెరికా తరహా వైద్య ేసవలు...

అమెరికా తరహా వైద్య సేవలు ఇక్కడా ఉన్నాయి

  • చికిత్స కోసం అక్కడికి వెళ్లేందుకు ఓ కేసులో నిందితుడి విజ్ఞప్తికి సుప్రీం నో

  • తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు రద్దు

న్యూఢిల్లీ, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి): చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఒక కేసులో నిందితుడు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమెరికా తరహా వైద్య ేసవలు మనదేశంలోనూ అందుబాటులో ఉన్నాయని వ్యాఖ్యానించింది. అతడి పేరు గునిగటి రవీందర్‌ రావు. తన తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించారంటూ శీస సంతోష్‌ 2014 అక్టోబరు 12న పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు నిందితుడు రవీందర్‌ రావుపై ఐపీసీ సెక్షన్లు 120-బి, 306 రెడ్‌ విత్‌ 34 కింద(ఆత్మహత్యకు ప్రేరేపించడం) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. 2016 ఫిబ్రవరి 29న చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. రవీందర్‌ రావు విచారణకు హాజరు కాకపోవడంతో నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌, లుక్‌ అవుట్‌ నోటీసు జారీ అయ్యాయి. 2016లో లుక్‌ అవుట్‌ నోటీసును సస్పెండ్‌ చేస్తూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆసరాగా తీసుకుని.. 2017లో అతడు అమెరికా వెళ్లిపోయాడు. అనంతరం 2025 ఏప్రిల్‌ 19న శంషాబాద్‌ విమానాశ్రయంలో దిగగానే పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల అయ్యాడు. నిందితుడు తన పాస్‌పోర్టును తిరిగి ఇవ్వాలని కోరగా మేజిస్ట్రేట్‌ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా మేజిస్ట్రేట్‌ కోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తూ రవీందర్‌ రావు తిరిగి అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. హైకోర్టు తీర్పును శీస సంతోష్‌ సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌పై జస్టిస్‌ దీపాంకర్‌ దత్త, జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మలతో కూడిన ధర్మాసనం కీలక తీర్పు ఇచ్చింది. అంతేకాదు.. ఈ కేసులో చార్జిషీట్‌ దాఖలై పదేళ్లు గడుస్తున్నా, నేటికీ విచారణ ప్రాథమిక దశలోనే ఉండడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘ఈ కేసు జరిగిన తీరును(క్రోనాలజీ) గమనిేస్త.. నిందితుడు ప్రతి దశలోనూ ఏదో ఒక కోర్టు గడప తొక్కుతూ విచారణ సాగకుండా అడ్డుకున్నాడనేది స్పష్టంగా కనిపిస్తోంది. 2016లో లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌ సస్పెండ్‌ చేస్తూ వచ్చిన కోర్టు ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లిపోవడం, విచారణ ఎదుర్కోకుండా తప్పించుకు తిరగడం వంటి ఆరోపణలను అంత తేలికగా తీసిపారేయలేం.’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఐపీసీ సెక్షన్‌ 306 కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం తీవ్రమైన కేసని న్యాయస్థానం గుర్తుచేసింది.

ఈ వార్తలు కూడా చదవండి...

ఫాంహౌస్‌ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌‌రెడ్డి

ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్

Read Latest Telangana News, AP News And National News

Updated Date - Jun 08 , 2026 | 06:11 AM