తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
ABN , Publish Date - Aug 03 , 2026 | 01:08 PM
తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
ఇంటర్నెట్ డెస్క్: తిరుప్పరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
జనవరి నెలలో మద్రాస్ హైకోర్టు ఆర్డర్ పాస్ చేస్తే.. మీరెందుకు జూన్ నెలలో పిటిషన్ వేశారంటూ తమిళనాడు ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. కొండపై రాతి స్తంభం వద్ద దీపం వెలిగించే సంప్రదాయం ఉందా అని ప్రశ్నిస్తూ.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన కోర్టు.. ఆరు వారాల్లోగా సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.
ఇవి కూడా చదవండి
రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల బీమా గడువు పొడిగింపు
మూడేళ్లుగా స్వర్ణానికి దూరం.. నీరజ్ చోప్రా కెరీర్ దారెటు?