Share News

ఎన్‌సీపీసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి..

ABN , Publish Date - Sep 29 , 2026 | 06:36 PM

బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR)పై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు కేటాయించాల్సిన 25 శాతం కోటా సీట్ల భర్తీ విషయంలో సరైన చర్యలు తీసుకోకపోవడంపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.

ఎన్‌సీపీసీఆర్ తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి..
Supreme Court On NCPCR

ఇంటర్నెట్ డెస్క్: ప్రైవేటు పాఠశాలల్లో పేద, బలహీన వర్గాల పిల్లలకు ఉచిత విద్య అందించేందుకు ఉద్దేశించిన విద్యాహక్కు చట్టం (RTE) అమలుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ముఖ్యంగా పాఠశాలల్లో 25 శాతం RTE కోటా సీట్ల భర్తీకి సంబంధించిన వివరాలను సమర్పించడంలో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (NCPCR) వ్యవహరించిన తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.

NCPCR దాఖలు చేసిన అఫిడవిట్‌పై అసంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. కమిషన్‌కు ఎవరు నాయకత్వం వహిస్తున్నారని, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అవసరమైతే NCPCR చీఫ్‌ను స్వయంగా కోర్టుకు పిలుస్తామని హెచ్చరించింది.


కేవలం డేటాను సేకరించడం కాకుండా.. RTE చట్టం అమలును పర్యవేక్షించడం, సంబంధిత సంస్థల నుంచి వివరాలు సేకరించి అమలులో లోపాలను గుర్తించడం కూడా NCPCR బాధ్యతల్లో భాగమేనని సుప్రీం పేర్కొంది. పేద, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందుబాటులోకి తీసుకురావడమే RTE చట్టం ప్రధాన లక్ష్యమని ధర్మాసనం స్పష్టం చేసింది.

Also Read:

శ్రీ చరణి సంచలనం.. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించి రికార్డ్..

ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు వర్తించవు: కర్ణాటక హైకోర్టు

Updated Date - Sep 29 , 2026 | 07:23 PM