ఆలయ ప్రవేశాన్ని నాస్తికులు హక్కుగా ఎలా కోరగలరు: సుప్రీంకోర్టు
ABN , Publish Date - Apr 30 , 2026 | 05:03 AM
ఉత్తర భారతదేశానికి చెందిన నాస్తికుడు దక్షిణాదిన ఉన్న శబరిమల ఆలయంలోకి ప్రవేశించే హక్కును ఎలా కోరగలరు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది....
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: ఉత్తర భారతదేశానికి చెందిన నాస్తికుడు దక్షిణాదిన ఉన్న శబరిమల ఆలయంలోకి ప్రవేశించే హక్కును ఎలా కోరగలరు అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆలయ ప్రవేశ హక్కుకు సంబంధించిన అంశాన్ని నిర్ణయించేటప్పుడు ఆ హక్కును కోరుతున్నది భక్తుడా.. లేక నాస్తికుడా అనే విషయాన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుందని పేర్కొంది. శబరిమలతో సహా మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్షకు సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా 9మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యాలు చేసింది. ఈ పిటిషన్లపై బుధవారం నాటి విచారణలో భాగంగా 2018నాటి తీర్పును సమర్థిస్తున్న బిందు, కనకదుర్గ అనే ఇద్దరు మహిళల తరఫున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న.. ‘ఆలయ ప్రవేశ హక్కును ఎవరు కోరుతున్నారు? ఒక భక్తురాలా లేక ఎవరి ప్రోద్బలంతోనో ఒక నాస్తికురాలా? ఈ ఆలయంతో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఉత్తర భారతదేశంలో ఎక్కడో ఉండి ఆలయ ప్రవేశాన్ని కోరుతున్నారు. దీన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది’ అని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
అనంతపురం మీదుగా తిరుపతికి రైలు
రైలులో మహిళపై దారుణం.. ఏసీ కోచ్‌లోకి తీసుకెళ్లి..
Read Latest Telangana News and National News