Share News

పై చదువులను దాచిపెట్టారని ఉద్యోగం నుంచి తొలగించవచ్చా?

ABN , Publish Date - Jun 03 , 2026 | 05:46 AM

ఉన్నత చదువుల వివరాలను దాచిపెట్టారన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించవచ్చా అన్న సమస్యపై విచారణ జరపనున్నట్టు మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది...

పై చదువులను దాచిపెట్టారని ఉద్యోగం నుంచి తొలగించవచ్చా?

  • విచారణ జరపనున్న సుప్రీంకోర్టు

  • తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన అభ్యర్థి

న్యూఢిల్లీ, జూన్‌ 2: ఉన్నత చదువుల వివరాలను దాచిపెట్టారన్న కారణంతో ఉద్యోగం నుంచి తొలగించవచ్చా అన్న సమస్యపై విచారణ జరపనున్నట్టు మంగళవారం సుప్రీంకోర్టు తెలిపింది. తెలంగాణలో ‘వర్క్‌ అసిస్టెంట్‌’ పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణత అర్హత కాగా, పవార్‌ సుభాష్‌ అనే ఎస్టీ అభ్యర్థి మాత్రం ఇంటర్మీడియట్‌ పాసయినా దాన్ని దాచిపెట్టి పదో తరగతి మాత్ర మే పాసయ్యానంటూ సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం పొందారు. కావాలనే సమాచారాన్ని దాచిపెట్టారని భావించిన కేంద్ర ప్రభు త్వం ఆయనను ఉద్యోగం నుంచి తొలగించింది. దీనిపై ఆయన సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రెబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయుంచగా మరోసారి పరిశీలించి ఆదేశాలివ్వాలని సూచించింది. విద్యార్హతలను దాచి పెట్టడం ద్వారా నిజాయితీని కోల్పోయారని, ఇలాంటి వ్యక్తు లు ఉద్యోగానికి తగరంటూ కేంద్రం మరోసారి ఆదేశాలు ఇచ్చింది. అనంతరం క్యాట్‌ కూడా ఈ వాదనతో ఏకీభవించింది. దీనిపై సుభాష్‌ హైకోర్టులో అప్పీలు చేయగా క్యాట్‌ తీర్పును సమర్థించిం ది. దాంతో ఆయన సుప్రీంను ఆశ్రయించారు. పరిశీలించిన ధర్మాసనం.. ప్రాథమికంగా చూస్తే హైకోర్టుతీర్పు తప్పనినిపిస్తోందని, పైచదువులు చదివారన్న కారణంతో ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించకూడదన్న సుప్రీం తీర్పులున్నాయని గుర్తు చేసింది.

Also Read:

ఖర్జూరాలు.. కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయా?

చిన్న పిల్లాడిలా మారి.. డ్యాన్స్ చేసిన విరాట్! వీడియో వైరల్...

For More Latest News

Updated Date - Jun 03 , 2026 | 05:46 AM