Share News

సెక్స్ వర్కర్లకు చట్టపరంగా సమాన రక్షణ ఉండాలి: సుప్రీం కోర్టు

ABN , Publish Date - May 29 , 2026 | 01:17 PM

స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంతపు అక్రమ రవాణా మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

సెక్స్ వర్కర్లకు చట్టపరంగా సమాన రక్షణ ఉండాలి: సుప్రీం కోర్టు
Supreme court Guidelines in handling Human traficcing cases

ఇంటర్నెట్ డెస్క్: స్వచ్ఛందంగా ప్రాస్టిట్యూషన్‌ను ఎంచుకోవడం, మానవ అక్రమ రవాణా బారినపడి సెక్స్ వర్క్‌లోకి దిగడం మధ్య స్పష్టమైన తేడా ఉందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇష్టపూర్వకంగా సెక్స్ వర్క్ చేసే వయోజనులను వేధించవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. సెక్స్ వర్కర్లకు చట్టపరంగా సమాన రక్షణ ఉండాలని పేర్కొంది. దాడుల సమయంలో వారి గుర్తింపును వెల్లడించొద్దని మీడియాకు కూడా వార్నింగ్ ఇచ్చింది. దేశంలో మానవ అక్రమ రవాణాను (Human Trafficking) అరికట్టేందుకు సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది.

స్వచ్ఛందంగా సెక్స్ వర్క్‌ను ఎంచుకున్న వారికి, మానవ అక్రమ రవాణా ముఠాల బారిన పడి ఈ రొంపిలో కూరుకుపోయిన బాధితులకు మధ్య తేడాను గుర్తించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. సొంత ఇష్టంతో సెక్స్ వర్క్ నిర్వహించే వయోజనులపై దాడులు చేయడం, క్రిమినల్ కేసులు పెట్టడం చట్టవిరుద్ధమని పేర్కొంది.


రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికీ గౌరవంగా జీవించే హక్కు ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కేవలం లైంగిక వృత్తిలో తల్లి ఉందనే ఏకైక కారణంతో ఆమె నుంచి బిడ్డను బలవంతంగా వేరు చేయలేరని కూడా సుప్రీం కోర్టు పేర్కొంది. రెస్క్యూ ఆపరేషన్ల సమయంలో సెక్స్ వర్కర్ల ఫోటోలు, వీడియోలు ప్రసారం చేయడం నేరమని పేర్కొంది.

నివాస ధ్రువీకరణ పత్రాలు లేకపోయినప్పటికీ సెక్స్ వర్కర్లందరికీ తక్షణమే ఆధార్ కార్డులు జారీ చేయాలని UIDAIకి కూడా ఆదేశించింది. స్వచ్ఛందంగా ఈ మార్గాన్ని ఎంచుకున్న వారిని వదిలి, మహిళలు, మైనర్లను అక్రమ రవాణా చేసే మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది.


ఈ వార్తలనూ చదవండి:

భారత్‌లోకి ఎలా వచ్చారో చెప్పిన బంగ్లాదేశీ అక్రమ వలసదారులు

సోనియా, రాహుల్ గాంధీలతో సిద్దరామయ్య భేటీ..

Updated Date - May 29 , 2026 | 01:50 PM