పరువు నష్టం దావాపై రాహుల్కు ఊరట
ABN , Publish Date - Oct 14 , 2026 | 05:06 AM
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మంగళవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం దావాలో విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 13: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మంగళవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మహారాష్ట్రలో నమోదైన పరువు నష్టం దావాలో విచారణపై స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. 2018లో రాజస్థాన్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీపై పరువుకు నష్టం కలిగించేలా విమర్శలు చేశారంటూ శ్రీశ్రీమల్ అనే బీజే పీ కార్యకర్త ఈ దావా వేశారు. విచారణకు రావాలంటూ గిరిగాం మేజిస్ట్రేటు సమన్లు జారీ చేయగా దాన్ని సవాలు చేస్తూ రాహుల్ తొలుత బాంబే హైకోర్టును ఆశ్రయించారు. సమన్ల కొట్టివేతకు హైకోర్టు నిరాకరించడంతో సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. సానుకూలంగా స్పందించిన ధర్మాసనం విచారణపై స్టే ఇచ్చింది. దీనిపై నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలంటూ పిటిషనర్కు, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది.
ఈ వార్తలు కూడా చదవండి
సీఈసీ రాజీనామా చేయకుంటే అభిశంసన తప్పదు.. ఎంపీ శశిథరూర్ హెచ్చరిక
నాసా–స్పేస్ఎక్స్ ప్రయోగం సక్సెస్.. ఐ ఎస్ ఎస్ కు 2,800 కేజీల సరుకులతో డ్రాగన్ నౌక