బోఫోర్స్ కేసు.. చివరి పిటిషన్‌నూ కొట్టేసిన సుప్రీం కోర్టు
ABN , Publish Date - Aug 07 , 2026 | 07:27 AM
నాలుగు దశాబ్దాల నాటి బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. ఈ ఉదంతానికి సంబంధించి 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ కే అగ్రవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నాలుగు దశాబ్దాల నాటి బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి పిటిషన్‌ను కూడా సుప్రీం కోర్టు గురువారం కొట్టేసింది. ఈ ఉదంతానికి సంబంధించి 2005లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ కే అగ్రవాల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఈ కేసులో పిటిషనర్ అదనపు సమయం కోరారు. అయితే, హిందూజా సోదరులు నిర్దోషులని ఢిల్లీ హైకోర్టు 2005లో తీర్పు ఇచ్చిన విషయాన్ని సుప్రీం కోర్టు పేర్కొంది. దీనిపై దాఖలైన సీబీఐ అప్పీలును కూడా కొట్టేసిన విషయాన్ని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేసును ఇంకా కొనసాగించడంలో అర్థం లేదంటూ సుప్రీం కోర్టు తాజా పిటిషన్‌ను తోసిపుచ్చింది.
హిందూజా సోదరులపై ఉన్న అన్ని ఆరోపణలకు సంబంధించిన కేసులను ఢిల్లీ హైకోర్టు 2005లో కొట్టేసింది. ఈ సందర్భండా సీబీఐపై విమర్శలు గుప్పించింది. సీబీఐ తీరుతో ఖజానాకు రూ.250 కోట్ల భారం పడిందని పేర్కొంది. ఈ తీర్పుపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను 2018లో సుప్రీం కోర్టు కొట్టేసింది. అప్పీల్ దాఖలుకు అకారణంగా సీబీఐ 4,522 రోజులు ఆలస్యం చేసిందంటూ కొట్టేసింది.
కేసు చరిత్ర ఇదీ..
400 హోవిట్జర్‌లను భారత్‌కు సరఫరా కోసం స్వీడెన్‌కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వంతో 1986 మార్చిలో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కాంట్రాక్ట్ దక్కించుకునేందుకు బోఫోర్స్ భారతీయులకు ముడుపులు చెల్లించాల్సి వచ్చిందని స్వీడెన్ రేడియో ప్రసారం చేసిన కథనం అప్పట్లో పెను కలకలానికి దారి తీసింది. అయితే, ఈ ఉదంతానికి చెందిన చివరి పిటిషన్‌ను కూడా తాజాగా ఫుల్ స్టాప్ పడింది.
ఈ వార్తలనూ చదవండి:
సేంద్రియ వ్యర్థాలతో ఇంధన ఉత్పత్తికి ప్రోత్సాహం.. కేంద్రం కీలక నిర్ణయం
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ‘క్లౌడ్ రీజియన్’