Share News

బెయిల్‌ అప్లికేషన్లపై 2 వారాలకు ఒకసారైనా విచారణ జరగాలి

ABN , Publish Date - May 12 , 2026 | 04:52 AM

దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో బెయిల్‌ దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది....

బెయిల్‌ అప్లికేషన్లపై 2 వారాలకు ఒకసారైనా విచారణ జరగాలి

  • అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, మే 11: దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో బెయిల్‌ దరఖాస్తులు భారీ సంఖ్యలో పెండింగ్‌లో ఉండటంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెయిల్‌ అప్లికేషన్లపై విచారణను వేగంగా ముగించేందుకు పలు సూచనలు చేసింది. ఇందులో భాగంగా బెయిల్‌ దరఖాస్తులను ఆటోమేటిక్‌గా లిస్టు చేసేలా హైకోర్టుల్లో సాఫ్ట్‌వేర్‌ వ్యవస్థ ఉండాలని ప్రతిపాదించింది. ఏదైనా బెయిల్‌ అప్లికేషన్‌పై విచారణ ప్రారంభించిన తర్వాత ఆ రోజు నుంచి మళ్లీ వారం రోజులకు లేదా కనీసం రెండువారాలకు ఒకసారైనా ఆ దరఖాస్తు మళ్లీ విచారణకు వచ్చేలా ఈ సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌ ఇవ్వాలని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోర్టులు ఈ దిశగా చర్యలు తీసుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేసింది. పెండింగ్‌ బెయిల్‌ దరఖాస్తులకు సంబంధించి ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ సూచనలు చేసింది.

ఇవి కూడా చదవండి..

మాజీ సీఎం స్టాలిన్‌ను కలిసిన విజయ్.. తమిళ రాజకీయాల్లో కొత్త చర్చ..

సీఎం తప్పితే ఇంకేమీ వద్దు... పట్టుబడుతున్న సతీశన్, రంగంలోకి రాహుల్

Updated Date - May 12 , 2026 | 04:52 AM