Share News

నీట్ రీటెస్టుపై పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నో

ABN , Publish Date - Jun 19 , 2026 | 01:10 PM

త్వరలో జరగనున్న నీట్ రీటెస్టుకు సంబంధించి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తక్షణ విచారణను చేపట్టేందుకు నిరాకరించింది.

నీట్ రీటెస్టుపై పిటిషన్.. తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నో
Supreme Court Refuses To Hear Plea Concerning NEET-UG 2026

ఇంటర్నెట్ డెస్క్: నీట్ రీటెస్టుకు సంబంధించి విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు తక్షణ విచారణను చేపట్టేందుకు నిరాకరించింది. నీట్ పరీక్ష సంబంధిత పిటిషన్‌లపై జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చెప్పట్టనుందని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఈ నేపథ్యంలో తాము తక్షణ విచారణ చేపట్టలేమని తేల్చి చెప్పారు.

పిటిషనర్ల తరఫున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ రీటెస్టుపై విద్యార్థుల్లో అనేక ఆందోళనలు నెలకొన్నాయని చెప్పారు. టెలిగ్రామ్‌ నిషేధంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఆందోళనలోకి నెట్టాయని అన్నారు. పేపర్ లిక్ వంటి అంశాలన్నీ విచారణ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయని తెలిపారు.


పరీక్ష అడ్మిట్ కార్డులను కొందరు విద్యార్థులు డౌన్‌లోడ్ చేసుకోలేకపోయారని కూడా విద్యార్థుల తరఫు న్యాయవాది అన్నారు. మరికొందరికి తాము ఆశించిన వాటికంటే భిన్నమైన పరీక్ష కేంద్రాల కేటాయింపు జరిగిందని చెప్పారు. పూర్తిస్థాయిలో సంసిద్ధమయ్యేందుకు విద్యార్థులకు తగిన సమయం లేదని అన్నారు.

అయితే, ఈ అంశాలపై తాము తక్షణ విచారణ చేపట్టలేమని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న నీట్ కేసులకు ఈ పిటిషన్‌ను ట్యాగ్ చేయాలన్న అభ్యర్థన కూడా సాధ్యం కాదన్నారు. ఇలాంటి అంశాలన్నీ జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలిస్తుందని చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

టెలిగ్రామ్‌కు చుక్కెదురు.. కేంద్రం నిర్ణయాన్ని సమర్థించిన ఢిల్లీ హైకోర్టు

మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం

Updated Date - Jun 19 , 2026 | 01:30 PM