ప్రమాదాల కారిడార్లుగా హైవేలు మారరాదు
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:55 AM
దేశవ్యాప్తంగా రహదారి భద్రతను మెరుగుపరచడానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై భారీ, వాణిజ్య వాహనాల పార్కింగ్‌పై నిషేధం విధించింది....
రహదారి భద్రతకు సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: దేశవ్యాప్తంగా రహదారి భద్రతను మెరుగుపరచడానికి సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై భారీ, వాణిజ్య వాహనాల పార్కింగ్‌పై నిషేధం విధించింది. అనుమతి ఉన్న నిర్దేశిత విశ్రాంతి లేదా పార్కింగ్ స్థలాలలో మినహా ఎక్కడా వాహనాలు ఆపడం లేదా పార్కింగ్ చేయడం చేయరాదని ఆదేశించింది. పరిపాలనా లోపాలు లేదా మౌలిక సదుపాయాల లేమి కారణంగా ఎక్స్‌ప్రెస్ వేలు ‘ప్రమాదాల కారిడార్లు’గా మారకూడదని హెచ్చరించింది. 2025 నవంబరులో తెలంగాణ, రాజస్థాన్‌లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 34 మంది మరణించిన నేపథ్యంలో సుమోటో కేసులో వ్యవస్థాగత నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ ఈ ఆదేశాలు ఇచ్చింది. రహదారి భద్రతపై పలు మార్గదర్శకాలను జారీ చేసింది. హైవేలపై భారీ వాహనాలు పార్కింగ్ చేయకుండా అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలు(ఏటీఎంఎస్), జీపీఎస్ ఆధారిత ఛాయాచిత్ర ఆధారాలు, ఈ-చలాన్ విధానాల ద్వారా కట్టడి చేయాలని సూచించింది. రహదారి హక్కు పరిధిలో కొత్త దాబాలు లేదా వాణిజ్య కట్టడాల నిర్మాణం, నిర్వహణపై సుప్రీం కోర్టు తక్షణం నిషేధం విధించింది. ప్రస్తుతమున్న అక్రమ కట్టడాలను 60 రోజుల్లోగా తొలగించాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా జిల్లా స్థాయి హైవేల భద్రత టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో