భోజశాల సమీపంలో నమాజ్‌లకు సుప్రీం ఓకే
ABN , Publish Date - Jul 31 , 2026 | 05:57 AM
మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న వివాదాస్పద భోజశాల-కమల్ మౌలా మసీదుకు సమీపంలోని దర్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు గురువారం సుప్రీంకోర్టు అనుమతి...
న్యూఢిల్లీ, జూలై 30: మధ్యప్రదేశ్‌లోని ధార్‌లో ఉన్న వివాదాస్పద భోజశాల-కమల్ మౌలా మసీదుకు సమీపంలోని దర్గా వద్ద ముస్లింలు ప్రార్థనలు చేసుకునేందుకు గురువారం సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్య నమాజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చీ, జస్టిస్ వి.మోహనాల ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. అయితే ముస్లింపక్షం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అంగీకారంతో నమాజ్ కోసం మరో స్థలాన్ని ఎంచుకునేందుకు ఈ ఉత్తర్వులు అడ్డంకికాబోవని స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలానికి సమీపంలో శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ నెల 14న సుప్రీంకోర్టు తొలుత ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను అమలు చేయడం లేదని పేర్కొంటూ ముస్లిం పక్షాన హజీ మునీర్ అహ్మద్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం కేసు తేలేవరకు దర్గా వద్ద నమాజ్‌కు అవకాశం కల్పించింది.
ఈ వార్తలనూ చదవండి:
కువైట్‌లోని చైనా కంపెనీపై ఇరాన్ దాడి
కుట్రపూరిత వీసా కేసు.. అమెరికా నుంచి భారతీయుడి బహిష్కరణ