Share News

బారామతిలో సునేత్రా పవార్‌ ఎన్నిక ఏకగ్రీవం!

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:08 AM

మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దివంగత నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ సతీమణి సునేత్రా...

బారామతిలో సునేత్రా పవార్‌ ఎన్నిక ఏకగ్రీవం!

  • ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకొన్న కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: మహారాష్ట్రలోని బారామతి అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక ఏకగ్రీవం కానుంది. దివంగత నేత, మాజీ ఉపముఖ్యమంత్రి అజిత్‌పవార్‌ సతీమణి సునేత్రా పవార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమం చేస్తూ కాంగ్రెస్‌ తన అభ్యర్థిని పోటీ నుంచి తప్పించింది. ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో అజిత్‌పవార్‌ ఆకస్మిక మరణం చెందిన సంగతి తెలిసిందే. ఆయనపై ఉన్న గౌరవంతోనే అభ్యర్థిని ఉపసంహరించుకున్నట్లు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ రమేష్‌ చెన్నితల స్పష్టం చేశారు. మొదట కాంగ్రెస్‌ తరపున అడ్వొకేట్‌ ఆకాశ్‌మోరేను బరిలోకి దించినప్పటికీ, పవార్‌ కుటుంబసభ్యురాలిపై పోటీ పెట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్‌.. గురువారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు వెనక్కి తగ్గింది.

ఈ వార్తలు కూడా చదవండి..

అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్సీ బొత్స

ఐఏఎస్‌లను బెదిరించి చీకటి జీవోలు తెచ్చారు.. కేసీఆర్‌పై ఎంపీ చామల ధ్వజం

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 10 , 2026 | 05:08 AM