Share News

చక్కెర నిల్వలపై కొరడా

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:44 AM

పండగల సీజన్‌ నేపథ్యంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది

చక్కెర నిల్వలపై కొరడా
sugar

  • గరిష్ఠ నిల్వ పరిమితి వెయ్యి క్వింటాళ్లకు తగ్గింపు

  • 15 రోజులకు మించి నిల్వ చేయకూడదు

  • అక్టోబరు 15 నుంచి నవంబరు 30 వరకు అమలు

న్యూఢిల్లీ, అక్టోబరు 1: పండగల సీజన్‌ నేపథ్యంలో చక్కెర ధరల నియంత్రణకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. డీలర్ల వద్ద చక్కెర నిల్వల అంశంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. చక్కెర డీలర్లు నిల్వ పరిమితిని మరింత తగ్గించింది. ప్రస్తుతం 2000 క్వింటాళ్లుగా ఉన్న ఈ నిల్వ పరిమితిని 1000 క్వింటాళ్లకు తగ్గించింది. అంతేకాక, డీలర్లు 15 రోజులకు మించి తమ వద్ద చక్కెర నిల్వలు ఉంచుకోవడానికి లేదని స్పష్టం చేసింది. ఈ కొత్త పరిమితులు అక్టోబరు 15 నుంచి నవంబరు 30 వరకు కోల్‌కతా, అసోం మినహా దేశవ్యాప్తంగా అమలులో ఉంటాయి. పంచదార ధరల నియంత్రణకు, కృత్రిమ కొరతను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టులో చక్కెర నిల్వల అంశంలో డీలర్లకు పరిమితులు పెట్టింది.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 03:48 AM